తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నేను సినిమా విషయంలో ఆ ముగ్గురినే నమ్ముతాను: బాలకృష్ణ - బాలకృష్ణ వీరసింహా రెడ్డి ట్రైలర్​

నందమూరి నటసింహం నటించిన వీరసింహారెడ్డి విడుదలై హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ సక్సెస్​మీట్​ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య సినిమా విషయంలో తాను ఎవరిని నమ్ముతారో చెప్పారు. ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

Balakrishna Veerasimha reddy success meet
వీరిసింహారెడ్డి సక్సెస్ మీట్​

By

Published : Jan 12, 2023, 8:55 PM IST

Updated : Jan 12, 2023, 10:08 PM IST

నందమూరి నటసింహం నటించిన వీరసింహారెడ్డి విడుదలై మంచి రెస్పాన్స్​తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ సక్సెస్​మీట్​ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య సినిమా విషయంలో తాను ఎవరిని నమ్ముతారో తెలిపారు. ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

"ఘనవిజయం అందించిన ప్రేక్షక దేవుళ్లకు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఇక ముందు ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రోత్సహించే, స్ఫూర్తినిచ్చిన అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓ హిట్‌ సినిమా తర్వాత మరొకటి వస్తుందంటే అంచనాలు పెరుగుతాయి. 'అఖండ' తర్వాత తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' విషయంలో అదే జరిగింది. అఖండ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు.. నేను దర్శకుడు కలిసి ఓల్డ్​ వైన్ న్యూ బాటిల్​లా ఫ్యాక్షన్​ ఎంటర్​టైనర్​ చేయాలి అని అనుకున్నాం. అనుకున్న విధంగా దర్శకుడు కథ, సాయిమాధవ్‌ బుర్రా అద్భుతమైన సంభాషణలు రాశారు. ప్రతి విభాగంవారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను తమన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. పాటలకు మంచి స్వరాలు సమకూర్చారు. హీరో- విలన్‌ పాత్రల తీరుకు తగ్గట్టు ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ కంపోజ్‌ చేశారు. సినిమా విషయంలో నేను.. దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటర్‌ను నమ్ముతా. ఏ సన్నివేశాన్నైనా రక్తి కట్టించగల సమర్థత ఈ మూడు విభాగాల్లోనే ఉంటుంది. థియేటర్లలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పోషించిన పాత్రను చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ ఫీలవ్వాలనే ఉద్దేశంతోనే ప్రచార చిత్రాల్లో ఆ క్యారెక్టర్‌ను ఎక్కువగా రివీల్‌ చేయొద్దని చెప్పా. కథానాయిక శ్రుతిహాసన్‌ చక్కగా నటించింది. నటులు, టెక్నిషియన్ల నుంచి అనుకున్న ఔట్‌పుట్‌ రాబట్టగలిగే సత్తా ఉన్న దర్శకుడు గోపీచంద్‌. ఈ చిత్రానికి పనిచేసిన కారు డ్రైవర్‌, ప్రొడక్షన్‌ బాయ్‌ నుంచి మేనేజరు వరకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా" అని బాలయ్య అన్నారు.

కాగా, 'క్రాక్‌' తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రమిది. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. హనీరోజ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దునియా విజయ్‌, నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్‌, మురళీ శర్మ, సప్తగిరి, తదితరులు కీలక పాత్ర పోషించారు. సినిమాటోగ్రఫీ:రిషి పంజాబీ; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి;సంగీతం: తమన్‌; మాటలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాణ సంస్థ: మైత్రిమూవీ మేకర్స్‌; నిర్మాతలు:నవీన్‌ ఏర్నేని, రవి శంకర్‌.

Last Updated : Jan 12, 2023, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details