నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' కూడా వాల్తేరు వీరయ్యకు పోటీగా ఇంకా బాక్సాఫీస్ ముందు జోరు కొనసాగిస్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి వసూళ్లను అందుకుంటోంది. విడుదలై18 రోజులైనా ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలయ్య అఖండ చిత్రం మెుదటి వారం.. రూ.53.49 కోట్ల షేర్(రూ.87.9 కోట్ల గ్రాస్) సాధించగా.. వీరసింహారెడ్డి మెుదటి వారంలో రూ.68.51 కోట్ల షేర్(రూ.114.95 కోగ్లా గ్రాస్) వసూళ్లు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచరం.
18 రోజుల ఏరియా వారీగా.. నైజాం 17.10కోట్లు, సీడెడ్ రూ. 16.40 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.52 కోట్లు, తూర్పు గోదావరి రూ.6.55 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.88 కోట్లు, గుంటూరు రూ.7.40 కోట్లు, కృష్ణ రూ. 4.70 కోట్లు, నెల్లూరు రూ. 2.97 కోట్లు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో రూ. 68.52 కోట్లు నెట్.. (రూ.111.20 కోట్లు గ్రాస్)గా వచ్చినట్లు తెలిసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.81 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.76 కోట్లు.. కలిపి ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో.. రూ. 79.09 కోట్లు షేర్ (రూ. 132.30 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయట.