తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాలీవుడ్​ రేంజ్​లో అన్​స్టాపబుల్​ ట్రైలర్​​.. బాలయ్య యాక్షన్​​ సూపర్​.. తొలి ఎపిసోడ్​ అప్పుడే - బాలకృష్ణ అన్​స్టాపబుల్​ లేటేస్​ అప్డేట్స్​

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షో సీజన్​ 2 ట్రైలర్​ వచ్చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం బాలయ్య యాక్షన్​, డైలాగ్​లతో అదిరిపోయింది. మీరు చూసేయండి..

Balakrishna unstoppable season 2 trailer released
బాలయ్య అన్​స్టాపబుల్​ సీజన్​ 2 ట్రైలర్​

By

Published : Oct 9, 2022, 11:33 AM IST

Updated : Oct 9, 2022, 12:00 PM IST

నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తోన్న టాక్​ షో అన్ స్టాపబుల్. సినిమాల్లో తన నటనతో, డైలాగ్స్​తో చెలరేగిపోయే బాలయ్య.. ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న అన్ స్టాపబుల్ షోతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనదైన మాటలతో, పంచ్​లతో సెలబ్రిటీలను ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్​లకు సంబంధించిన సీక్రెట్స్ బయట పెడుతూ సందడి చేశారు బాలకృష్ణ. ఇప్పుడు సీజన్ 2తో మరో సరికొత్త గెటప్​తో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీని కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. తాజాగా ఈ సీజన్​ 2 ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా అదిరిపోయింది. ఇందులో బాలయ్య గెటప్​, స్టైల్​, డైలాగ్​, యాక్షన్​ అదిరిపోయింది. కత్తి పట్టుకుని గాల్లోకి ఎగురుతూ సాహసాలు చేస్తూ కనిపించారయన. ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!! మీకోసం... మరింత రంజుగా... దెబ్బకు థింకింగ్ మారిపోవాలా! అంటూ ఆయన చెప్పిన డైలాగ్​ ట్రైలర్​కే హైలైట్​గా నిలించింది. అక్టోబర్​ 14నుంచి సీజన్​ 2 స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపారు.

ఓటీటీ చరిత్రలోనే హెచ్​డీఆర్​లో విడుదలైన మొదటి ప్రోమో ఇదే కావడం విశేషం. ఇక ఈ ట్రైలర్​ను జాంబీ రెడ్డి, కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా ఇప్పటికే గత సీజన్‌లో చూపించారు. ఇప్పుడు కూడా ఎవరూ ఊహించని విధంగా బాలయ్యను సరికొత్తగా చూపించి ఫ్యాన్స్​కు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చారు.

కాగా, గత సీజన్‌లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఇక తాజా సీజన్​లోనూ స్టార్ సెలబ్రిటీలు చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. తొలి గెస్ట్​గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోతున్నట్లు ఇటీవలే ప్రచారం సాగింది. షో చిత్రీకరణలో చంద్రబాబు హాజరైనట్లు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఈ షోలో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని సమాచారం.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు. ఈ మూవీ తర్వాత ఆయన అనిల్​ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. యువ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించబోతుంది.

ఇదీ చూడండి:'కాంతార' తెలుగు ట్రైలర్​ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : Oct 9, 2022, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details