Unstoppable Season 2 : టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ప్రోమో ఎలా ఉంటుంది?. షోలో గెస్ట్లుగా ఎవరు వస్తారు? తొలి ఎపిసోడ్ అతిథి ఎవరు? అనే విషయాలపై సీజన్-1 ముగిసినప్పటి నుంచే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఓ ఫొటో.. నెట్టింట చర్చనీయాంశమైంది. అనంతరం ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ సెట్ దగ్గర.. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బాలయ్య ఉన్న ఫొటో బయటకు వచ్చింది. దీంతో.. అన్‌స్టాపబుల్ రెండో సీజన్ చంద్రబాబు ఎపిసోడ్‌తోనే ప్రారంభం కావచ్చని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ప్రోమో టీజర్ విడుదల చేశారు. అయితే ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేశారు.
అన్‌స్టాపబుల్ సీజన్-1కు తొలి గెస్ట్‌గా దిగ్గజ నటుడు మోహన్ బాబును ఆహ్వానించారు. ఆ ఎపిసోడ్లో మోహన్ బాబుతో కలిసి బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్లలోనూ కుర్ర నటులతో కలిసి అదే స్థాయిలో హడావుడి చేశారు. పెళ్లి విషయంలో రానాను టీజ్ చేసి, నానితో కలిసి క్రికెట్ ఆడి, అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప స్టెప్పులేసి.. సెట్లో దుమ్మురేపారు బాలకృష్ణ. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సీజన్-1కు గ్రాండ్ ఫినిషింగ్ ఇచ్చారు.