నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ సీజన్-2' అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇటీవలే ఈ షోలో బాలయ్యతో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన తొలి భాగంగా ఇటీవలే రిలీజై రికార్డు కూడా సృష్టించింది. అయితే ఇప్పుడు రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
బాలయ్యకు ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ఇంట్రెస్టింట్‌గా అన్‌స్టాపబుల్ ప్రోమో - బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోమో 2
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2లో ప్రభాస్-గోపిచంద్‌కు సంబంధించిన ఎపిసోడ్ రెండో భాగంగాపై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పార్ట్ 2 ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ కమంలోనే దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. ప్రభాస్, గోపీచంద్‌ను సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ముఖ్యంగా ప్రభాస్, గోపీచంద్ మధ్య జరిగిన సరదా సంభాషణలు ఆసక‍్తిని పెంచుతున్నాయి. 'డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోంది. మాకో స్టార్ గోపీచంద్‌తో ఫ్రెండ్షిప్ కథలు, బాహుబలి సినిమా విజయంపై సరదా ప్రశ్నలతో మరింత ఆసక్తి పెరుగుతోంది. జనవరి 6 వరకు వేచి ఉండండి.' అంటూ ఆహా ట్వీట్ చేసింది. అంటే జనవరి 6న రెండో భాగం ప్రసారం కానున్నట్లు ఆహా తెలిపింది.
ఇదీ చూడండి:Varisu trailer: తెలుగు ట్రైలర్ ఆగయా.. దళపతి క్లాస్ అండ్ మాస్ యాక్షన్ సూపరహే