అన్‌స్టాపబుల్-2 షోలో తనదైన శైలిలో అలరిస్తూ.. గెస్ట్‌లతో సందడి చేస్తున్నారు హీరో బాలకృష్ణ. సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షో రెండో సీజన్ మూడో ఎపిసోడ్‌కు యువ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు. అయితే తాజాగా 'దెబ్బకు థింకింగ్ మారి పోవాలి..' లాంటి ఆసక్తికర పంచులతో తాజా ప్రోమో విడుదలై ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
Unstoppable: సెల్ఫీ అడిగితే చెంప పగల కొట్టిన హీరో - అన్‌స్టాపబుల్ శర్వానంద్ ప్రోమో
బాలయ్య అన్‌స్టాపబుల్ 2 షో తాజా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో యంగ్ హీరోస్ శర్వానంద్, అడివిశేష్ సందడి చేశారు. మీరు చూసేయండి..
'ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికీ బాలుడే..' అని శర్వానంద్ చెప్పిన మాటకు స్టేజంతా చప్పట్లతో మారుమోగింది. ఇక బాలకృష్ణ కోసం రష్మికకు వీడియోకాల్ చేశాడు శర్వానంద్. ఆ హీరోయిన్‌తో ముద్దుసీన్‌లు వద్దని చెప్పాడు అడవి శేష్. 'మీరెంత చెప్పినా ఎడిటింగ్ ఉండేది నా చేతిలోనే' అంటూ పంచ్‌లు వేశారు బాలకృష్ణ. 'సెల్ఫీ అడిగితే చెంప పగల కొట్టిన హీరో ఎవరు?' ప్రశ్నకు మరి ఈ యంగ్ హీరోలు ఏం సమాధానం చెప్పారు.. వీరిద్దరూ కలిసి బాలయ్యతో చేసిన సందడి ఈ ప్రోమోలో మీరు చూసేయండి. నవంబరు 4న ప్రీమియర్స్ స్ట్రీమింగ్ కానుంది.
ఇదీ చూడండి:నాగచైతన్య హీరోయిన్‌తో లవ్‌లో పడిన కడలి హీరో