తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Balakrishna Unstoppable 3 : ఓవైపు భగవంత్​ కేసరి.. మరోవైపు అన్​స్టాపబుల్​-3.. బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్​ ట్రీట్​! - బాలకృష్ణ అన్​స్టాపబుల్ 3

Balakrishna Unstoppable 3 : దసరా పండుగకు నందమూరి బాలయ్య ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్​!.. బాలకృష్ణ నటించిన భగవంత్​ కేసరి సినిమా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రాగా.. దసరా రోజు అన్​స్టాపబుల్​-3 తొలి ఎపిసోడ్​ కానుందట. అందుకు ఆహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిందట.

Balakrishna Unstoppable 3
Balakrishna Unstoppable 3

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 11:38 AM IST

Updated : Oct 6, 2023, 11:53 AM IST

Balakrishna Unstoppable 3 :టాలీవుడ్​ స్టార్​ నటుడు నందమూరి బాలకృష్ణ.. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. మధ్యలో అన్​స్టాపబుల్​ వంటి సెలబ్రిటీ క్రేజీ టాక్​షోతో దూసుకెళ్తున్నారు. నటసింహంగా వెండితెరపై అలరించిన బాలయ్యను బుల్లితెరపై హోస్ట్‌గా చూపించాలన్న నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయం.. అన్‌స్టాపబుల్ షో ప్రసారమైన తర్వాత శభాష్ అనిపించుకుంది. ఆహా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది.

అన్​స్టాపబుల్​-3కు బాలయ్య సైన్​!
బాలయ్య వ్యాఖ్యాతగా అన్​స్టాపబుల్​ మొదటి సీజన్​ ఘన విజయం సాధించడంతో రెండో సీజన్​ను ప్లాన్​ చేసింది ఆహా. అది కూడా గ్రాండ్​ సక్సెస్​ అయింది. దీంతో అన్‌స్టాపబుల్ మూడో సీజన్ కోసం ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు అటు ఈ షోను ఎంతగానో ఇష్టపడిన ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూడో సీజన్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటికి వచ్చింది. ఇటీవలే బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్ సీజన్ 3కు సైన్ చేశారట. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టి దసరా సమయంలో తొలి ఎపిసోడ్ స్టీమింగ్​ కానుందని సమాచారం. ఇదే నిజమైతే.. ఈ దసరాకి నందమూరి అభిమానులకు రెండు జాతరలు వచ్చినట్టే. ఒకటి భగవంత్ కేసరి సినిమా.. రెండు అన్‌స్టాపబుల్ 3.

మొదటి గెస్ట్​గా చిరు!
అయితే అన్‌స్టాపబుల్ మూడో సీజన్‌ తొలి ఎపిసోడ్​కు అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, విక్టరీ వెంకటేశ్​ను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో త్వరలో తెలిసిపోనుంది. అన్‌స్టాపబుల్ తొలి సీజన్‌ను మోహన్ బాబు, మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్నల ఎపిసోడ్‌తో బాలయ్య మొదలుపెట్టారు. ఈ తొలి ఎపిసోడ్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే రెండో సీజన్‌ను మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుతో మొదలుపెట్టారు. మరి ఈ మూడో సీజన్‌ను ఏ సెలబ్రిటీతో మొదలుపెడతారో చూడాలి.

మూడో సీజన్​కు హార్డ్​ వర్క్​!
కాగా, మూడో సీజన్ కోసం రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట. తొలి రెండు సీజన్లు అంత పెద్ద హిట్ కావడంలో రవి కీలక పాత్ర పోషించారు. మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా తన వంతు సాయం చేశారు. మరీ ఈ మూడో సీజన్‌కు అల్లు అరవింద్ ఎవరెవరిని దింపుతారో చూడాలి!

Last Updated : Oct 6, 2023, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details