నటసింహం నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. వరుస సినిమాల షూట్లతో బిజీగా ఉండే ఈ స్టార్ హీరో.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షోను దిగ్విజయంగా నడిపించారు. ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తున్న ఈ నందమూరి హీరో.. త్వరలో 'ఆహా' కోసం ఓ వెబ్ సిరీస్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్లు వేస్తున్నారని సమాచారం.
వెబ్‌సిరీస్‌లో బాలయ్య.. ఇక ఓటీటీలో దబిడి దిబిడే! - నందమూరి బాలకృష్ణ న్యూస్
నటసింహం నందమూరి బాలకృష్ణ వెబ్ సిరీస్ చేయనున్నారా?.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆ వివరాలు..
ఇప్పటికే ఆహాలో స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ సీజన్ 2కు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలకృష్ణ హోస్టింగ్ కూడా అదిరిపోయేలా ఉంది. అయితే బాలకృష్ణను ఈ డిజిటల్ వేదికపై తీసుకురావడం వెనుక నిర్మాత అల్లు అరవింద్ కృషి ఉందట. మరి ఇప్పుడు బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేయిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఆయనదే అని టాక్. ఒక వేళ ఈ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే బాలకృష్ణను వెబ్ సిరీస్‌లో చూసే ఛాన్స్ దొరికినట్లే.
'అన్‌స్టాపబుల్' షోతో మారిన రేంజ్..
'ఆహా'కు పేరుతో పాటు ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకొచ్చిన షోగా 'అన్‌స్టాపబుల్' నిలిచింది. దీని మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్‌పై దృష్టి పెట్టింది ఆహా టీమ్. అలా రెండో సీజన్లో నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, జయసుధ, జయప్రద లాంటి సినీ రాజకీయ సెలబ్రిటీలను షోకు తీసుకు వచ్చారు. మరోవైపు యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. అన్స్టాపబుల్కు వచ్చి సందడి చేశారు. దీంతో ఆహాకు ఇంతటి పాపులారిటీ తెచ్చిన బాలకృష్ణతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందట 'ఆహా' టీమ్. ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.