Balakrishna Mokshagna :నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అదే రేంజ్లో సూపర్ హిట్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. ఈ క్రమంలో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాతో గ్యాప్ ఇవ్వకుండా మరిన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోనున్నారు బాలయ్య. వచ్చే ఏడాది కోసం పెద్ద ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
బాలయ్యకు ఎప్పటి నుంచో మూడు కోరికలు ఉన్నాయట. వాటి కోసం ఆయన చాలా కాలం నుంచి గ్రౌండ్ వర్క చేస్తున్నారట. అందులో మొట్టమొదటిది 'ఆదిత్య 369'కి సీక్వెల్‌ను తెరకెక్కించడం. ముప్పై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అటు బాలయ్యతో పాటు ఇటు మూవీ లవర్స్ కూడా చాలా కాలంగా ఈ స్వీకెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా 'భగవంత్ కేసరి' ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల చేసిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఈ సీక్వెల్ గురించి మరింత క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌ను చాలా కాలం క్రితమే ఆయన తెరకెక్కించనున్నట్లు చెప్పారని తెలిపారు. ఇక 'ఆదిత్య 999' కథ సిద్ధంగా ఉందని.. ఒక రోజు రాత్రిలోనే ఈ స్టోరీని రెడీ చేసిన్నట్లు ఆయన అన్నారు.
ఇక తన నటన, మేనరిజంతో ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ.. త్వరలో మెగాఫోన్ పట్టనున్నారట. 'ఆదిత్య 999' సినిమాను(Aditya 369 Sequel) ఆయనే తెరకెక్కించనున్నారట. అయితే ఈ సినిమా తన దర్శకత్వానికి డెబ్యూ లేదా రెండో సినిమా కావొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారు. దీని బట్టి చూస్తుంటే ఆయన మరో సినిమాను కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.