తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Mokshagna: మహేశ్​ మల్టీప్లెక్స్​లో యంగ్​ లయన్​.. వీడియో చూశారా? - మోక్షజ్ఞ ఎంట్రీ

హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. మహేశ్​బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్​లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఇది చూసిన అభిమానులు మోక్షజ్ఞ చూసి తెగ సంబరపడిపోతున్నారు.

Mokshagna teja at amb cinemas
థియేటర్​లో మోక్షజ్ఞ

By

Published : Oct 8, 2022, 3:29 PM IST

నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్​గా మారింది. ఏదో ఎప్పుడో ఓ సారి సోషల్​మీడియాలో అలా మెరుపులా మెరిసి వెళ్లిపోతుంటాడు. చివరిసారిగా బర్త్ డే సెలబ్రేషన్స్​లో తండ్రితో కలిసి సందడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్​లో కనపడ్డారు.

సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్​లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు. ఒక్కడే సోలోగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. వీడియో చూసిన నందమూరి అభిమానులు.. "యంగ్ లయన్ వస్తోంది చూడండి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆదిపురుష్​ టీమ్​కు షాక్.. రిలీజ్​పై స్టే విధించాలని పిటిషన్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details