తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాలో ఇంకా కసి తీరలేదు.. తప్పకుండా ఆ సినిమా చేస్తా: బాలకృష్ణ - Veerasimha reddy updates

నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబోలో తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ సందర్భంగా వేడుకలో పాల్గొన్న బాలకృష్ణ ఏమన్నారంటే..

Veerasimha reddy
Veerasimha reddy

By

Published : Jan 6, 2023, 10:46 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబోలో తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం వీరసింహారెడ్డి సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రా మైదానంలో ప్రీ రిలీజ్‌ వేడుకను గ్రాండ్​గా నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

"నాకు జన్మనిచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు నా తండ్రి ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు. నా తండ్రి, గురువు, దైవమైన ఆయనకు ముందుగా శతజయంతి అభినందననలు తెలుపుకుంటున్నాను. నటనలో ఆయన ప్రయోగాల దిట్ట. అలాంటి నటుడు మరొకరు లేరన్న విషయాన్ని నేనే కాదు ప్రతి నటుడూ అంగీకరించక తప్పదు. ఆయన సినిమాలతో కళామ తల్లి పండుగ చేసుకుంది. ఇకపోతే ఈ రోజుతో సంక్రాంతి మొదలైపోయింది. ప్రతిఒక్కరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబసభ్యుడైన దర్శకుడు బి. గోపాల్​ గారికి ధన్యవాదాలు. ​ఎప్పటికైనా మంగోలియన్స్ అయిన జంగిస్​ ఖాన్ సినిమా తీస్తా. ఈ వేడుకకు అందాన్ని, పెద్దరికాన్ని తీసుకొచ్చేది దర్శకుడు బి. గోపాల్‌గారనే అనుకుని ఆయన్ను ఆహ్వానించాం. ఆయనకు ధన్యవాదాలు. నాతో రౌడీ ఇన్​స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం వంటి అద్భుత సినిమాలు తీశారు. ఇకపోతే నటులు, టెక్నిషియన్ల నుంచి ప్రతిభను వెలికితీయగల సత్తా ఉన్న ఒంగోలు గిత్త మన గోపీచంద్‌ మలినేని. ఈయనే కాదు నా తదుపరి చిత్రం దర్శకుడు అనిల్‌ రావిపూడిది ఒంగోలే. నేనెప్పుడూ రాయలసీమకే పరిమితమవుతానని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదు. మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజు నేనే. రెడ్డిని నేనే, నాయుడిని నేనే. అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. ఎన్నో రకాల సినిమాలు చేసినా నాకు ఇంకా కసి తీరలేదు. భిన్నమైన పాత్రలు పోషించడం, బాధ్యతలు నిర్వహించడంలోనే తృప్తి. ఇక బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలకే పరిమితం అని అనుకునే వారికి సమాధానం అన్‌స్టాపబుల్‌ కార్యక్రమం. టాక్‌ షోలలో అది నంబరు 1గా నిలిచింది. అలానే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీరసింహారెడ్డి ఒకటి. నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పనిచేశారు" అని బాలకృష్ణ అన్నారు. శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ.. "గోపీచంద్‌ దర్శకత్వంలో నేను నటించిన మూడో సినిమా ఇది. ఆయన్ను నేను అన్నయ్యగా భావిస్తా. బాలకృష్ణగారు పాజిటివ్‌ పర్సన్‌. ఎంతో ఉత్సాహంగా ఉంటారు" అని శ్రుతిహాసన్‌ అన్నారు.

ఇదీ చూడండి: 'వీరసింహారెడ్డి' ట్రైలర్​​.. సంతకాలు చేస్తే బోర్డుపై పేరు మారుతుందేమో.. చరిత్ర సృష్టించిన వాడి పేరు కాదు..

ABOUT THE AUTHOR

...view details