తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK 107: బాలయ్యతో సెల్ఫీ.. శ్రుతిహాసన్​ ఫన్నీ ఎక్స్​ప్రెషన్​! - బాలకృష్ణ శ్రుతిహాసన్​ 107 అప్డేట్​

Balakrishna Shrutihassan Selfie: ఎన్​బీకే 107 షూటింగ్​లో బాలయ్య- శ్రుతిహాసన్​ కలిసి దిగిన ఓ ఫన్నీ సెల్ఫీ సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

Balakrishna  Shrutihassan funny selfie
బాలయ్యతో ఫన్నీ సెల్ఫీ

By

Published : Jul 25, 2022, 8:30 PM IST

Balakrishna Shrutihassan Selfie: రాయలసీమ నేపథ్యానికీ... బాలకృష్ణ సినిమా కథలకీ విడదీయలేని అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరోసారి సీమలోకి అడుగుపెట్టి.. ఎన్​బీకే 107 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి కర్నూలు నగరం, కొండారెడ్డి బురుజు సెంటర్‌ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్​ జరుగుతోంది. ఈ షెడ్యూల్​లో హీరోయిన్​ శ్రుతిహాసన్​ కూడా పాల్గొంది. అయితే తాజాగా షూట్​కు సంబంధించి ఓ పిక్​ను పొస్ట్​ చేసింది.. ఈ మూవీలో నటిస్తున్న నటి మీనాకుమారి. విరామం సమయంలో బాలయ్యతో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. ఇందులో హీరోయిన్​ శ్రుతిహాసన్ కూడా ఉన్నారు. ఈ పిక్​లో ఆమె ఇచ్చిన కామెడీ ఎక్స్​ప్రెషన్​ అభిమానులను నవ్విస్తోంది. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

కాగా, బాలయ్య కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రధారి. బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తుండగా, రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రచిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ పనిలో విజయ్​సేతుపతి- కత్రిన ఫుల్​ బిజీ.. ఫొటోస్​ వైరల్​!

ABOUT THE AUTHOR

...view details