నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన తమ్ముడు, హీరో బాలకృష్ణ నివాళులు అర్పించారు. హరికృష్ణను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రచారంలో చైతన్య రథ సారధిగా ఉన్నప్పటి హరికృష్ణ ఫోటోలను షేర్ చేశారు.
"మా అన్న నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సంధర్భంగా ఆ మహానుభావుడికి నా ఘన నివాళులు.. తనకోసం కంటే నాన్నగారి ఆశయాల కోసం ఏంతో కష్టపడ్డాడు, నాన్నగారి కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి, తెలుగువాడి కోసం పార్లమెంట్లో గర్జించిన నిజమైన తెలుగువాడు, ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయిన ఆయన ఙ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి, నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు హరన్న. నందమూరి హరికృష్ణ అమర్ రహే..." అని బాలకృష్ణ రాసుకొచ్చారు. కాగా, హరికృష్ణ 2018 ఆగస్ట 29 నల్గొండ హైవేపై రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.