నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో 'అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే'. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో విశేష ప్రజాదరణ పొందింది. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో బాలయ్య ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఈ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సీజన్ 2కు సంబంధించి ఆహా ఓ సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. అన్‌స్టాపబుల్ యాంథమ్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఊర్రూతలూగిస్తున్న బాలయ్య 'అన్‌స్టాపబుల్' యాంథమ్.. అదిరిపోయింది అంతే! - అన్‌స్టాపబుల్ సీజన్ 2 యాంథమ్
నట సింహాం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ యాంథమ్ విడుదల అయింది. ఇది అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఈ పాటను ర్యాపర్ రోల్‌రైడా ఆలపించగా, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చారు. 3.39 నిమిషాలు నిడివి ఉన్న ఈ సాంగ్.. 'ఏదైనా నేను దిగనంత వరకే, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్' అంటూ బాలయ్య డైలాగ్‌తో ప్రారంభమైంది. 'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగ్ వదిలితే మోగి పోద్ది బాడీ అంతా' అంటూ ఆయన గత సినిమా పేర్లు, డైలాగ్‌లు కలగలపి ఈ పాటను రూపొందించారు. వీడియోలో.. తొలి సీజన్లో సెలబ్రిటీ కంటెస్టెంట్లతో బాలయ్య సందడి చేసిన సన్నివేశాలు, మేకింగ్ వీడియోలను చూపించడం ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఈ హైపర్ సాంగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.
ఇదీ చూడండి: విజయ్-అజిత్ కాంబోలో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?