Balakrishna NBK 109 Remuneration : టాలీవుడ్లో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు సక్సెస్ అవ్వడంతో మంచి జోరు మీదున్నారు. అయితే ఇప్పుడాయన తన తర్వాతి సినిమా NBK 109 కోసం భారీగా పారితోషికం పెంచేశారని టాక్ వినిపిస్తోంది.
వివరాళ్లోకి వెళితే.. బాలయ్య నుంచి తాజాగా రిలీజైన భగవంత్ కేసరి కోసం రూ.18కోట్లు తీసుకున్నారని సమాచారం అందింది. అంతకుముందు వీరిసింహా రెడ్డి కోసం తీసుకున్నదాని కన్నా రూ.4 కోట్లు ఎక్కువట. అంటే వీరసింహారెడ్డికి రూ.14కోట్లు. ఇక బ్లాక్ బాస్టర్ హిట్ అఖండ కోసం రూ.10కోట్లు తీసుకున్నారట. దాన్ని కన్నా ముందు వచ్చిన రూలర్ చిత్రం కోసం రూ.7కోట్లు వసూలు చేశారని తెలిసింది.
అంటే ఒక్కో సినిమా హిట్ అవుతూ వెళ్తుండడంతో అందుకు తగ్గట్టే.. సినిమా సినిమాకు రూ.4కోట్ల వరకు పెంచుకుంటూ వెళ్తున్నారు బాలయ్య. అయితే ఈ సారి దర్శకుడు బాబీతో చేయబోయే సినిమాకు మాత్రం ఏకంగా రూ.10కోట్లు పెంచేశారని బయట కథనాలు వస్తున్నాయి. NBK 109 కోసం రూ.28 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.