తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అఖండ - వీరసింహా - భగవంత్ కేసరి.. ఈ మూడింటిలో కామన్​ పాయింట్​ ఇదే! - బాలకృష్ణ తమన్ మ్యూజిక్ కాంబినేషన్

టాలీవుడ్​ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్​ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి విజయాల జోష్​తో భగవంత్​ కేసరిలో నటిస్తున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో రెండు కామన్​ పాయింట్లు ఉన్నాయి. బాలయ్య సినిమాల సక్సెస్​ సీక్రెట్​ ఆ పాయింట్లేనని ఫ్యాన్స్​ అంటున్నారు.

balakrishna thaman combination
బాలకృష్ణ తమన్ కాంబినేషన్

By

Published : Jun 10, 2023, 7:44 PM IST

Updated : Jun 11, 2023, 7:03 AM IST

ఆయన పేరే అభిమానులకు స్లోగన్‌. ఆయన తొడగొడితే సినిమా పక్కా 'పైసా వసూల్‌’. 'సాహసమే జీవితం' అని భావించే ఆయనకు 'ఆత్మబలం' ఎక్కువ. 'సింహా' పేరంటే ఆయనకు మక్కువ. ఆ 'నిప్పులాంటి మనిషి' ఇంకెవ్వరు?.. ఆయనే నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్​లో చేతినిండా సినిమాలో నటసింహం బిజీగా ఉన్నారు. యంగ్​ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి విజయాల జోష్​తో భగవంత్​ కేసరిలో నటిస్తున్నారు. తాజాగా మరో కొత్త సినిమా కూడా ప్రకటించారు.

అయితే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్​ కేసరి.. ఈ మూడు సినిమాల్లో రెండు కామన్​ పాయింట్లు ఉన్నాయి. అఖండ, వీరసింహా రెడ్డిలో బాలయ్య తన వయసుకు తగ్గ మేనరిజమ్​తో కనిపించారు. మరి భగవంత్​ కేసరిలో కూడా సేమ్ అదే మేనరిజమ్​తో కనిపించనున్నారు. మరోవైపు, ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు తమన్​ మ్యూజిక్​ అందించడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో తమన్​ మ్యూజిక్​ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన 'భగవంత్ కేసరి' టీజర్​ చూస్తే.. ఈ సినిమాలోనూ పవర్​పుల్​ ప్యాకేజ్​తో కూడిన మ్యూజిక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏజ్​కు తగ్గ బాలయ్య పాత్రలు.. తమన్​ మ్యూజికే నటసింహం సినిమాల సక్సెస్​ సీక్రెట్​ అని నెటిజన్లు అంటున్నారు.

బాలకృష్ణ - తమన్ కాంబినేషన్..
డిక్టేటర్ సినిమా కోసం బాలయ్యతో తమన్​ కలిసి పని చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ చివరి రెండు సినిమాలకు కూడా తమన్​నే మ్యూజిక్​ అందించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో బాలకృష్ణ వరుసగా తమన్​కు మూడో సినిమాలో అవకాశం ఇచ్చారు. రెండు వరుస హిట్​లతో జోరుమీదున్న బాలయ్య 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్​ కొట్టేందుకు చూస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్​ థియేటర్లలో ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించింది. ఇక అఖండ సినిమాకు కొన్ని థియేటర్​లలో సౌండ్​ స్పీకర్లు సైతం బద్దలు అయ్యాయి. ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం కోసం తమన్ ఎంత కష్టపడ్డారో.. అప్పట్లో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే బాలయ్య తదుపరి చిత్రం 'ఎన్​బీకే 109'కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమనే అని సమాచారం. ఆ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్​లో రానున్న చిత్రానికి సైతం తమనే సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ - తమన్ కాంబినేషన్​ ఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారింది.

ఎన్​బీకే 109 వివరాలు..
నటసింహం బాలకృష్ణ వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' షూటింగ్​లో ఉన్న ఆయన.. శనివారం ఎన్​బీకే 109 సినిమాకు కొబ్బరికాయ కొట్టి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్రయూనిట్ 'ఎన్​బీకే 109'కు సంబంధించి కాన్సెప్ట్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ పోస్టర్​ను చూస్తుంటే బాలయ్య - బాబీ కాంబినేషన్​లో మరో యాక్షన్ ఎంటర్​టైనర్ ఖాయమని అనిపిస్తోంది. కత్తులు, గొడ్డలి, ఆల్కహాల్​తో కూడిన ఓ బాక్స్ ఈ పోస్టర్​లో కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Last Updated : Jun 11, 2023, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details