తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మహేశ్ బాబు'కు అవార్డు ఇద్దామనుకుంటున్నా- నా ఫేవరెట్ హీరో అతడే : బాలకృష్ణ - అన్​స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్

Balakrishna Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్ సీజన్-3' తాజా ఎపిసోడ్​లో పలు ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరిగాయి. అవేంటంటే?

Balakrishna Mahesh Babu
Balakrishna Mahesh Babu

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 6:54 AM IST

Updated : Dec 26, 2023, 8:51 AM IST

Balakrishna Mahesh Babu : నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా 'అన్​స్టాపబుల్ సీజన్ 3' టాక్ షో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోంది. ఈ సీజన్​లో మూడో ఎపిసోడ్​లో సీనియర్ హీరోయిన్లు సుహాసిని, శ్రియా శరణ్, డైరెక్టర్లు హరీశ్ శంకర్, జయంత్ పరంజీ గెస్ట్​లుగా వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఎపిసోడ్​లో పలు ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు జరిగాయి. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

ఈ ఎపిసోడ్​లో పాల్గొన్న గెస్ట్​లతో బాలకృష్ణ సరదాగా ముచ్చటిస్తూ వారితో ఆడిపాడారు. ముఖ్యంగా హీరోయిన్ శ్రియాతో కలిసి స్టెప్పులేయడం ఎపిసోడ్​లో హైలైట్​గా నిలిచింది. కాగా, వారితో మాట్లాడుతుండగా ఓ సందర్భంలో అవార్డుల ప్రస్తావన వచ్చింది. అప్పుడు బాలయ్య 'నేను అవార్డును నా అభిమాన హీరో మహేశ్ బాబుకు ఇద్దాం అనుకుంటున్నా' అని అన్నారు. అంతే ఈ వీడియో క్లిప్పును సూపర్​స్టార్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఇక 'జీవితంలో​ భర్త తన భార్యకు కచ్చితంగా ఐ లవ్​ యూ చెప్పాలి' అని డైరెక్టర్ హరీశ్ శంకర్ అనగా దానికి బాలయ్య ఆయన శైలిలో రిప్లై ఇచ్చారు. 'నా ఎల్డర్ బ్రదర్ రానా దగ్గుబాటి నాతో ఐ లవ్​ యూ చెప్పించేశాడు' అని బాలకృష్ణ సమాధానమిచ్చారు. అయితే 'రానా' రిస్క్ చేశారంటూ హరీశ్ శంకర్ సరదాగా అన్నారు.

Ustaad Bhagat Singh Update :దర్శకుడు హరీశ్ శంకర్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్​సింగ్' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవర్​స్టార్ పవన్ కల్యాణ్ లీడ్​ రోల్​లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్​ గురించి హరీశ్ శంకర్​ను షో లో బాలయ్య అడిగారు. 'ఏంటి హాలీడేస్​ ఉన్నాయా ఫ్రీ గా ఉన్నావ్' అని అన్నారు. 'ఈ గ్యాప్ వెకేషన్ మాత్రమే, సినిమా రిలీజైతే సెన్సేషనే' అని హరీశ్ శంకర్ రిప్లై ఇచ్చారు.

గుంటూరు కారంలో 'చెప్పవే చిరుగాలి' సాంగ్! మహేశే పాడారట!

'అన్​స్టాపబుల్​' సెట్​లో రణ్​బీర్​, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్

Last Updated : Dec 26, 2023, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details