Mokshagna Tollywood Entry Balakrishna: తన తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. "అంతా దైవేచ్ఛ" అని నవ్వి ఊరుకున్నారు.
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ - మోక్షజ్ఞ వార్తలు
నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటుడిగా ఆయన వెండితెరకు పరిచయం కానున్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. తాజాగా బాలకృష్ణ వీటిపై స్పందించారు. ఏమన్నారంటే?
అనంతరం 'అఖండ-2'పై స్పందించారు. ''అఖండ-2' తప్పకుండా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాం. ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇటీవల 'అఖండ' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.