Balakrishna Hat Trick Hits : ఆరుపదుల వయసులో కూడా నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరనరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి'తో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్‌లో ఉన్నారు. దసరా కానుకగా విడుదలైన 'భగవంత్ కేసరి' సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. వరసగా మూడోసారి భగవంత్ కేసరి సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టారు బాలకృష్ణ. దీంతో సీనియర్ హీరోలకు ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు.
'అఖండకు' ముందు బాలకృష్ణ కేరీర్లో ఒక్క సినిమా కూడా రూ.100 కోట్ల మార్క్‌ను దాటలేదు. సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచినా.. రూ.40 కోట్లు దాటేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమాలు సూపర్ హిట్స్‌తో సెంచరీలు కొడుతున్నారు. 'అఖండ' విజయంతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.
Balakrishna Upcoming Projects :మరోవైపు.. బాలకృష్ణ ఎన్బీకె109 వర్కింగ్ టైటిల్‌తో బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత 110వ చిత్రం బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్నట్లు సమాచారం. 'అఖండ' సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్లో అఘెర పాత్రతో పాటు పొలిటికల్ టచ్ ఇచ్చేలా దర్శకుడు బోయపాటి ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆ తర్వాత గోపిచంద్ మలినేని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలున్నాయని సమాచారం.