తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెస్టారెంట్​లో అలా చేసిన బాలయ్య, సంబరపడిపోతున్న ఫ్యాన్స్​ - బాలకృష్ణ ఎన్​బీకే 107 షూటింగ్​

'ఎన్​బీకే 107' కోసం టర్కీ వెళ్లిన నందమూరి బాలకృష్ణ అక్కడ ఓ రెస్టారెంట్​కు వెళ్లారు. అయితే ఆ రెస్టారెంట్​లో ఆయన చేసిన ఓ పని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ బాలయ్య ఏం చేశారంటే.

Balakrishna chit chat with common man
రెస్టారెంట్​లో బాలకృష్ణ

By

Published : Aug 31, 2022, 11:50 AM IST

Balakrishna chit chat with common man గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూట్‌ కోసం బాలయ్య ఇటీవల టర్కీ వెళ్లారు. మరికొన్ని రోజులపాటు చిత్రబృందం ఇక్కడే ఉండనుంది. ఈ క్రమంలో బాలయ్య టర్కీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ కుటుంబంతో కలిసి టిఫిన్‌ చేసి.. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. "హే బాయ్‌.. టీఫిన్‌ చేసేశా. ఇక, మందులు వేసుకునే సమయమైంది. ఓవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, మరోవైపు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఇలా ఇన్ని పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంది. ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చునేవాళ్లకి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి" అని బాలయ్య చెప్పారు.

అనంతరం అక్కడే ఉన్న మహిళను చూపించి.. "వీళ్లు ఇంట్లో కూర్చొని ధారావాహికలు చూస్తుంటారు. మైండ్‌ పాడుచేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచిది" అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో ఆ కుటుంబం నవ్వుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. బాలయ్యను మెచ్చుకుంటున్నారు. అగ్రకథానాయకుడు అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా సామాన్యులతో ఆయన ప్రవర్తించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

బాలయ్య సెల్ఫీ


ఇదీ చూడండి: రాకింగ్​ రాకేశ్​-సుజాత పెళ్లి ఫిక్స్​, ఎప్పుడంటే

ABOUT THE AUTHOR

...view details