టాలీవుడ్లో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు. తమ అభిమాన హీరోల పాటలను యువ హీరోలు రీమిక్స్ చేసి తమ సినిమాలో పెట్టుకుంటుంటారు. అయితే ఇప్పటి వరకు ఏ కథానాయకుడు కూడా తన పాటలనే తాను నటించే సినిమా కోసం రీమిక్స్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఈ కొత్త ట్రెండ్ షురూ కాబోతుందని తెలుస్తోంది. తమ సినిమాల్లోని హిట్ పాటలను.. తమ కొత్త చిత్రాల్లో రీమేక్ చేసేందుకు అగ్రతారలు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే వాల్తేరు వీరయ్యలో తన వింటేజ్ లుక్, మ్యానరిజంను గుర్తుచేస్తూ ఆడియెన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చారు చిరు. అలాగే ఈ మూవీలో తన ఓల్డ్ సాంగ్‌కు హీరోయిన్ శృతిహాసన్‌తో కలిసి సేమ్ ఓల్డ్ స్టైల్లో చిందులేశారు. దీన్ని ఫ్యాన్స్‌ను బాగా ఎంజాయ్ చేశారు. దీంతో మళ్లీ అదే ఫార్మూలను రిపీట్ చేస్తూ.. తన కొత్త సినిమా భోళాశంకర్లోనూ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. 'చూడాలని వుంది' సినిమాలోని సూపర్ హిట్ పాట 'రామ చిలకమ్మా'ను రీమేక్స్ చేయబోతున్నారని కథనాలు వస్తున్నాయి. మహతి స్వర సాగర్ ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారట.
అయితే ఇప్పుడు ఈ ఎక్స్‌పెరిమెంట్‌ను నందమూరి బాలకృష్ణ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత బాలయ్య ప్రస్తుతం NBK 108 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన వీరసింహారెడ్డిలో ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించి వింటేజ్ బాలయ్యను గుర్తుచేశారు. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తన ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. బాలకృష్ణ కెరీర్లో సూపర్ హిట్ అందుకున్న సమరసింహారెడ్డిలోని 'అందాల ఆడబోమ్మ' సాంగ్‌ను మళ్లీ రీమిక్స్ చేయబోతున్నారట. దీనికి తమన్ సంగీతం అందించనున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే.. తమన్ మ్యూజిక్‌లో ఆ సాంగ్ రీమిక్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇకపోతే ఫాదర్ అండ్ డాటర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల.. భార్యగా కాజల్ అగర్వాల్ నటించనుందట. చూడాలి మరి ఈ రీమిక్స్ సాంగ్స్ ఎలా ఉంటాయో.
ఇదీ చూడండి:వినోదయ సీతమ్.. పవన్-సాయితేజ్‌తో పాటు ఇంకెవరు నటిస్తున్నారంటే?