తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్​కు బాలయ్య సింహగర్జన.. ఆ సినిమా రీరిలీజ్.. ఓవర్​సీస్​లో ఫుల్ కలెక్షన్స్​! - బాలకృష్ణ గోపిచంద్ మలినేని సినిమా

బాలకృష్ణ-వి.వి.వినాయక్​ కాంబోలో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబరు 25 నాటికి ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు కానున్న సందర్భంగా మరోసారి ఈ సినిమా ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు. టికెట్​ బుకింగ్స్​ కూడా ఓపెన్​ అయిపోయాయి. ఇంతకీ ఏఏ థియేటర్లు ఈ మూవీ ప్రదర్శన అవ్వబోతుంటే..

Balakrishna Chennakesavareddy  rerelease
బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​

By

Published : Sep 20, 2022, 4:58 PM IST

Updated : Sep 21, 2022, 5:18 PM IST

కొన్ని రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజున 'పోకిరి', పవన్ కళ్యాణ్ పుట్టినరోజున 'జల్సా', 'తమ్ముడు' వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ రిలీజ్ చేసి ఫ్యాన్స్​ ఫుల్​ ఎంజాయ్​ చేస్తున్నారు. ఈ చిత్రాలు రీరిలీజ్‌లోనూ మంచి వసూళ్లను అందుకున్నాయి. అయితే తాజాగా అభిమానులు మరో స్టార్ హీరో చిత్రాన్ని మళ్లీ భారీగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేంటంటే..

బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​

నందమూరి నటసింహం నటించిన బ్లాక్​ బస్టర్​ హిట్​ సినిమాల్లో 'చెన్నకేశవరెడ్డి' ఒకటి. బాలయ్య కెరీర్‌లో ఫ్యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఊరమాస్ చిత్రంగా నిలిచిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. 2002లో విడుదలైన ఈ చిత్రం మాస్​ ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. ఈ సినిమాను దర్శకుడు వివి.వినాయక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం.. బాలయ్య డ్యుయెల్ రోల్‌లో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులకు థియేటర్లలో విజిల్స్ టాప్ లేపాయి. అయితే ఈ చిత్రం సెప్టెంబరు 25 నాటికి విడదలై 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగానే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లో ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రసాద్​ మల్టీప్లెక్స్​ సహా పలు థియేటర్లలో టికెట్స్​ బుక్సింగ్స్​ కూడా ఓపెన్​ అయిపోయాయి.

బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​
బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​

అయితే ఓవర్సీస్‌లో బాలయ్యకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో యూఎస్​ఏ, అక్కడ కూడా స్పెషల్ షోస్​ రూపంలో రీరిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రాన్ని 24 తేదీన అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు ప్రకటించారు. 30 థియేటర్లలో విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని థియేటర్లు పెరగొచ్చని అన్నారు. మరి ఈ చిత్రం రీరిలీజ్‌తో బాలయ్య థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​
బాలయ్య చెన్నకేశవరెడ్డి రీరిలీజ్​

కాగా, ఈ యాక్షన్​ రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా చిత్రంలో బాలయ్య, టబు, శ్రియా, జయప్రకాష్​రెడ్డి, బ్రహ్మనందం తదితురులు ముఖ్య పాత్రల్లో నటించారు. వి.వి. వినాయక్​ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఇందులో బాలయ్య ఓ స్థానిక నాయకుడిగా, పోలీస్​ ఆఫీసర్​గా ద్విపాత్రాభినయంలో నటించి అదరగొట్టారు.

యూఎస్​ థియేటర్ లిస్ట్​

ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. పులిచర్ల నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, దునియా విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందింస్తున్నారు. దీని తర్వాత బాలయ్య.. అనిల్​రావిపూడి మరో చిత్రం చేయనున్నారు. అనిల్‌ శైలికి పూర్తి భిన్నమైన కథాంశంతో.. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారని, ఆయన కూతురుగా శ్రీలీల నటించనుందని గతంలో చిత్ర దర్శకుడు ప్రకటించారు. ప్రియమణి ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: అఖిల్​ బాలీవుడ్​ ఎంట్రీకి ప్లాన్​.. ఆ బడా నిర్మాతతో నాగార్జున చర్చలు!

Last Updated : Sep 21, 2022, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details