Ballayya Boyapati Movie: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ సినిమాలుగా గుర్తింపు తేవడమే కాకుండా ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రాలుగాను నిలిచాయి. అందుకే ఈ కాంబో మళ్లీ రిపీట్ అయితే బాగుంటుందని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి కూడా అదే పనిలో ఉన్నారని సమాచారం.
బాలయ్య, బోయపాటి కాంబోలో కొత్త సినిమా అనగానే అందరూ అఖండ-2 ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని ఆ మధ్య ఓ రియాలిటీ షోలో బోయపాటి స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే కథ విషయంలో బాలయ్య ఓ షరతు పెట్టారని టాలీవుడ్లో టాక్. లెజెండ్ రేంజ్లో పొలిటికల్ స్టోరీ ఉండాలని బాలయ్య కోరుకుంటున్నారట. అందుకు బోయపాటి కూడా సరే అన్నారని సమాచారం.