Narasimha Naidu Rerelease : తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆయన సూపర్ హిట్ సినిమాల్లో 'నరసింహ నాయుడు' ఒకటి. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
బాలకృష్ణ బర్త్‌డేకు రీరిలీజ్!
Balakrishna Birthday :జూన్ 10న గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ బర్త్‌డే. ఆ రోజే 'నరసింహ నాయుడు' సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలంగాణ, ఏపీతో పాటు అమెరికాలోని కొన్ని లొకేషన్లలో ఈ సినిమా విడుదల కానుంది. బాలయ్య అభిమానులు భారీ ఎత్తున హంగామా చేయడానికి రెడీ అవుతున్నారు.
'లక్స్ పాప'... ఇప్పటికీ ఫేమస్సే!
Narasimha Naidu Songs : 'నరసింహ నాయుడు' సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆషా షైనీ హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ కథ అందించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో ఫ్యాక్షన్ సీన్లకు థియేటర్లలో ఈలలే ఈలలు. ముఖ్యంగా బాలకృష్ణ ఉగ్ర నరసింహుడిగా మారి చేసిన యాక్షన్ సీన్లు ప్రేక్షకులు అందరినీ అలరించాయి.
ఈ సినిమాలోని పాటల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 'లక్స్ పాప' సాంగ్ ఇప్పటికీ ఫేమస్సే! ఎక్కడో ఒక చోట వినపడుతూ ఉంటుంది. 'కో కో కోమలి..', 'నిన్న కుట్టేసినాది..', 'చిలకపచ్చ కోక..' పాటలు కూడా హిట్టే. ఈ సినిమా మ్యూజిక్ అప్పట్లో సెన్సేషన్. మరోసారి థియేటర్లలో పాటలకు, ఫైట్లను ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.