Balakrishna Bhairava Dweepam Postpone : నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన గతంలో నటించిన క్లాసిట్ హిట్ జానపద చిత్రం 'భైరవద్వీం' నేడు(ఆగస్ట్ 30) విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా రిలీజ్ అవ్వట్లేదని తెలిసింది. దీంతో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది!
ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. సీనియన్ నటి రోజా హీరోయిన్గా నటించింది. మాధవ పెద్ది సురేష్ స్వరాలు సమకూర్చారు. 1994లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అలానే 9 నంది పురస్కారాల్ని అందుకుంది. అయితే ఇప్పుడు తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలయ్య సినిమాలను రీరిలీజ్‌లు చేస్తున్నారు. ఇప్పటికే 'చెన్న కేశవరెడ్డి', 'నరసింహనాయుడు' రిలీజై బాలయ్య అభిమానులను అలరించాయి. ఇక ఇప్పుడు భైరవద్వీపం వంతు వచ్చింది.
Balakrishna Bhagwant Kesari : ఈ చిత్రానికి ఆధునిక హంగులు అద్ది 4కె రిజుల్యూషన్‌తో విడుదల చేయ్యాలని సిద్ధమయ్యారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ కూడా ఓ పోస్టర్‌ను వదిలింది. దీంతో ఈ క్లాసిక్ హిట్ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ బాగా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు టెక్నికల్ సమస్యల వల్ల ఈ రీరిలీజ్‌ను ఆపినట్లు తెలిసింది. రీషెడ్యూల్ చేసి నవంబర్ నెలకు పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం అందింది. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలిసింది. బాలయ్య సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించగా.. ఇతర కీలక పాత్రల్లో యంగ్ బ్యూటీ శ్రీలీల శరత్ కుమార్ నటించారు.
లైనప్‌తో బాలయ్య ఫుల్ బిజీ.. ఆ సీనియర్ డైరెక్టర్‌కు ఛాన్స్ దొరుకుతుందా?
Skanda Pre Release Event : అతడు నాకే సవాల్ విసిరాడు.. తప్పకుండా సక్సెస్ అవుతా!.. బాలయ్య