Balakrishna Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తతం 'భగవంత్ కేసరి' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. దసరా కానుకగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి దూసుకెళ్తూ సక్సెస్‌ను అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన బాలయ్య మేనియా నడుస్తోంది. సోషల్ మెసేజ్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చితంలో బాలయ్యతో పాటు శ్రీలీల కాజల్ తమదైన శైలిలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడారు. తొలిసారి అయినప్పటికీ.. ఏమాత్రం తడబడకుండా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. తన డైలాగ్ డెలివరీతో థియేటర్లను షేక్ చేశారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేసి ఆయన ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. అయితే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. దానికి మూవీ టీమ్ అంతా హాజరై సందడి చేసింది. ఈ క్రమంలో బాలయ్య సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. త్వరలో ఈ సినిమా హిందీలో డబ్ అవ్వనుందని.. అందులోని 'భగవంత్ కేసరి' పాత్రకు స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పారని పేర్కొన్నారు. ఈ మాట విన్న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. బాలయ్య వాయిస్‌ను హిందీలో వినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
"నాకు , మా నాన్నకు కొత్త ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. అందుకే హిందీలో కూడా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. హిందీలో డబ్బింగ్ చెప్పడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాతో హిందీ భాషపై నాకున్న పట్టును మీరు త్వరలోనే చూస్తారు. తెలుగువాళ్ల సత్తా ఈ సినిమా నిరూపిస్తుంది." అని బాలకృష్ణ ఈ ఈవెంట్లో చెప్పుకొచ్చారు.