ఆరుపదుల వయసులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గతేడాది 'అఖండ'తో ఘన విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం అదే జోష్‌లో 'వీరసింహా రెడ్డి' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే దర్శకుడు అనిల్ రావిపూడితో మరో మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచారు.
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ కూడా ఒకటి. మాస్, క్లాస్ కథ ఏదైనా బాలయ్య తనదైన శైలిలో నటించగలరు. ఇక కామెడీ, మాస్(సరిలేరు నీకెవ్వరు) ఎంటర్టైనర్ చిత్రాలను తీయడంలో అనిల్ తనకు తానే సాటి. దీంతో ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూతురిగా యువ నటి శ్రీలీల కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం బాలీవుడ్ నటుల పేర్లను పరిశీలిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.