Balakrishna Anil Ravipudi NBK 108 Movie: ఆరుపదుల వయసులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాళ్ విసురుతున్నారు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన 'అఖండ'లో బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం బాలయ్య అదే జోష్‌లో 'వీరసింహా రెడ్డి' చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజైన పోస్టర్‌లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
బాలయ్య 'NBK 108' మూవీ సూపర్ అప్డేట్!.. నందమూరి అభిమానులకు పండగే!! - బాలకృష్ణ వార్తలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించనున్న కొత్త చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ సంగతులు..
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడితో మాస్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. కెరీర్ బిగెనింగ్ నుంచి కామెడీ కథలనే నమ్ముకుని హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి.. మొదటి సారిగా యాక్షన్ సినిమా చేస్తున్నారు. అది కూడా మాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో చేస్తున్నారు. ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న గ్రాండ్‌గా లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ కుమార్తెగా 'పెళ్లిసందD' హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.