తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్యతో బోయపాటి మరో మూవీ.. ఆరోజే లాంచ్.. ఆ హిట్​ సినిమాకు సీక్వెలేనా? - అఖండ 2

బాలయ్య-బోయపాటి కాంబోలో రిలీజైన సూపర్​ హిట్​ బ్లాక్​బస్టర్​ మూవీ 'అఖండ'. 2021లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కనక వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం నెట్టింట ఈ సినిమా గురించి ఓ తాజా వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

akhanda 2
akhanda 2

By

Published : Mar 28, 2023, 7:13 AM IST

'అఖండ' సినిమాతో అభిమానులకు తనలోని నట విశ్వరూపాన్ని చూపించారు నందమూరి బాలకృష్ణ. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 'అఖండ' విజయాన్ని సాధించడంతో పాటు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక బాలయ్య-బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చిన ఈ సినిమాకు అభిమానులు బాగా కనెక్టయ్యారు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను కూడా పలు ఇంటర్వ్యూల్లో ప్రస్థావించారు. ఈ సినిమాకు కచ్చితంగా సీక్వెల్ తీసే అవకాశం ఉందంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా సెట్స్​పైకి ఎప్పుడు వెళ్లనుందన్న విషయంపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్​ కోసం వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. కాగా తాజాగా నెట్టింట వైరలవుతున్న ఓ సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి త్వరలోనే ఓ గుడ్​ న్యూస్​ వినే అవకాశలున్నాయట. త్వరలోనే 'అఖండ'-2 ప్రారంభమవ్వనుందట.

ఇప్పటికే హీరో నందమూరి బాలకృష్ణతో..దర్శకుడు బోయపాటి 'అఖండ'-2 తీసే విషయంపై చర్చించారని.. దీనికి బాలయ్య సైతం సానుకూలంగా స్పందించారని టాక్​. అన్నీ సెట్​ అయితే ఇక ఈ సినిమా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10 లాంచ్ అయ్యే అవకాశాలున్నాయట. అయితే రీసెంట్​గా బాలయ్య బోయపాటి కాంబోలో ఓ పొలిటికల్​ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు సైతం నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో మొదట ఏది పట్టాలెక్కనుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్​ రావిపుడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎన్​బీకే 108 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మే చివరి కల్లా కంప్లీట్​ అయ్యే అవకాశాలున్నాయట. ఇక ఇదే సమయంలో బోయపాటి శ్రీను కూడా యంగ్​ హీరో రామ్ పోతినేనితో తీస్తున్న సినిమాను కంప్లీట్ చేయనున్నారట. ఇప్పటికే షూటింగ్​ను వేగవంతం చేస్తున్నారని టాక్​. దీంతో వీరి కాంబినేషన్‌లో ఇక 'అఖండ'-2 త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో బాలయ్య సరసన కాజల్​ అగర్వాల్​ నటిస్తుండగా.. యంగ్​ హీరోయిన్​ శ్రీలీల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా జరగుతున్న ఈ షూటింగ్​లో బాలయ్యతో పాటు శ్రీ లీల, కాజల్​ జాయినయ్యారు. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్​ స్వరాలు సమకూర్చనున్నారు. షైన్ స్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్​ మరింత పవర్​ఫుల్​గా ఉంటుందని టాక్​.

ABOUT THE AUTHOR

...view details