తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​బాబు దర్శకుడితో బాలయ్య.. ​ఫైట్​తో 'పుష్ప2' షురూ - యశోద సినిమా విడుదల

వరస సినిమాలతో దూకుడు మీదున్నారు కథానాయకుడు బాలకృష్ణ. తన రాబోయో సినిమాలకు దర్శకులు వీళ్లే అని సమాచారం. ఇక ఈ కథనంలో పుష్ప 2, యశోద చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు చూద్దాం..

balakrishna allu arjun
బాలకృష్ణ అల్లు అర్జున్​

By

Published : Nov 2, 2022, 9:11 AM IST

వరస సినిమాలతో దూకుడు మీదున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి'ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ 108వ సినిమాని అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్నారు. మరి 109వ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇటీవల ఓ వేడుకలో 'మిమ్మల్ని వచ్చి త్వరలోనే కలుస్తాను. ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాను. ఆ విషయం నిర్మాత అల్లు అరవింద్‌గారికి కూడా తెలుసు'అని చెప్పారు పరశురామ్‌.

బాలకృష్ణ

దీంతో 109వ సినిమాకి ఆయనే దర్శకుడని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు అరవింద్‌ కథ విన్నారంటే సినిమాపై ఓ మంచి అంచనాకు వచ్చేయ్యొచ్చని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మహేష్‌బాబుతో 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత నాగచైతన్యతో ఓ సినిమాని చేస్తున్నారు పరశురామ్‌. బాలకృష్ణ ఈలోపు అనిల్‌ రావిపూడి సినిమాని పూర్తి చేస్తారు.

పోరాటంతో ప్రారంభం

అల్లు అర్జున్​

'పుష్ప' చిత్రానికి దక్కిన విజయం 'పుష్ప2'పై భారీ అంచనాల్ని పెంచేసింది. అందుకే ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఈ చిత్ర రెండో భాగం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది.

తొలి షెడ్యూల్‌ ఈనెల రెండో వారంలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొదలు కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా అల్లు అర్జున్‌పై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అక్కడ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కథను విదేశాలతోనూ ముడిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలువురు విదేశీ నటులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

'యశోద'.. రియల్‌ యాక్షన్‌

సమంత

'ది ఫ్యామిలీమ్యాన్‌ 2' వెబ్‌సిరీస్‌తో తనలోని యాక్షన్‌ నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది సమంత. ఇప్పుడు 'యశోద' కోసం మరోసారి తనలోని యాక్షన్‌ భామను నిద్రలేపింది. సామ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. హరి - హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రంలో డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్ని పూర్తి చేసింది సమంత. ఇందుకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు.

అందులో చిత్ర యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ యానిక్‌ మెన్‌ మాట్లాడుతూ.. "యాక్షన్‌ సన్నివేశాల్ని సమంత ఎంతో శ్రద్ధగా చేస్తారు. ప్రతిసారీ తన బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందుకే తనతో షూటింగ్‌ చేయడం చాలా బాగుంటుంది. నాకు యాక్షన్‌ ఎప్పుడూ రియల్‌గా ఉండటం ఇష్టం. ఈ చిత్రంలో స్టంట్స్‌ అన్నీ అలాగే ఉంటాయి. నిజ జీవితంలో ఎలా జరుగుతుందో.. ఈ సినిమాలో యాక్షన్‌ కూడా అంతే వాస్తవికంగా ఉంటుంది. కిక్‌ బాక్సింగ్‌, జూడో, మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌.. అన్నీ 'యశోద' యాక్షన్‌ సీన్స్‌లో ఉంటాయి" అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చెప్పులు వేసుకోకుండానే వాళ్లను కలుస్తా

అమితాబ్ బచ్చన్​​

దేశవ్యాప్తంగా ఎంతోమంది వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు అమితాబ్‌బచ్చన్‌. అభిమానులంటే కూడా ఆయనకి ఎనలేని ప్రేమ. ఆయన ఎంతో ఇష్టంగా కట్టుకున్న 'జల్సా'లో ప్రతి ఆదివారం అభిమనులను కలుసుకునేవారు. వాళ్లని ఆప్యాయంగా పలకరించేవారు. కరోనా సమయంలో ఓ రెండేళ్లు పైగానే ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు.

కరోనా తగ్గాకా మళ్లీ ప్రతి ఆదివారం ఆయన ఫ్యాన్స్‌కు దర్శనం ఇస్తున్నారు. అలా ఈ మధ్య కలిసిన ఫొటోల్లో అమితాబ్‌ చెప్పులు లేకుండా ఉన్నారు. దీని వెనకున్న కారణాన్ని అమితాబ్‌ వివరించారు. "నేను ఎప్పుడు జల్సాలో అభిమానుల్ని కలిసినా చెప్పులు తీసేస్తాను. ఎందుకంటే నా అభిమానులంటే నాకు భక్తి. వాళ్లను కలవడం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలాంటిది" అని చెప్పారు.

ఇదీ చదవండి:అల్లుఅర్జున్​ సీక్రెట్స్​ను అతడికే చెప్తారట.. భార్యకు కూడా నో

సల్మాన్ ఖాన్‌కు Y+ సెక్యూరిటీ.. కారణం ఇదే...

ABOUT THE AUTHOR

...view details