తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇఫిలో సందడి చేయనున్న బాలయ్య 'అఖండ', 'ఆర్​ఆర్ఆర్'​ - ఇఫి గోవా

గోవాలో జరగనున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా సెక్షన్‌లో తెలుగు నుంచి రెండు సినిమాలు సందడి చేయనున్నాయి. అవేవంటే..

rrr and akhanda in iifi 2022
rrr and akhanda in iifi

By

Published : Oct 23, 2022, 8:00 AM IST

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)లో మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా సెక్షన్‌లో తెలుగునుంచి రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌', బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ'లు ప్రదర్శితం కానున్నాయి. ఇవి కాకుండా ఇందులో ప్రదర్శన కోసం 25 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 20 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఎంపికయ్యాయి.

ఈ విభాగంలో తెలుగునుంచి ఎంపికైన వాటిలో కండ్రేగుల ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా బండి, విద్యాసాగర్‌ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుధిరాంబోస్‌ సినిమాలు ఉన్నాయి. మేజర్‌ హిందీ చిత్రం కూడా ఈ విభాగంలో ఎంపిక అయింది. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో తెలుగునుంచి ఒక్కటీ ఎంపిక కాలేదు.

ABOUT THE AUTHOR

...view details