నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో 'ఆదిత్య 369' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. అప్పట్లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయబోతున్నట్లు గతంలో బాలకృష్ణ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో లేదో అనునుకున్నారు. తాజాగా 'ఆదిత్య 999' సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది ఆదిత్య 999 సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహించబోతున్నట్లు స్పష్టం చేశాకు. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దాస్ కా ధమ్కీ ట్రైలర్ హైదరాబాద్ ఏఎంబీ మాల్లో బాలయ్య లాంఛనంగా ఆవిష్కరించారు.