తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాహుబలి రేంజ్​ సినిమాలో బాలయ్య.. దాదాపుగా షూటింగ్ పూర్తి.. కానీ! - balakrishna anilravipudi movie

నందమూరి బాలకృష్ణ బాహుబలి లాంటి బడా బడ్జెట్​ సినిమాలో నటించారట. ఇంచుమించు ఆ చిత్రం కథ కూడా బాహుబలిలానే ఉంటుందట. కానీ అది..

balayya
బాహుబలి లాంటి బాలయ్య

By

Published : Sep 21, 2022, 8:47 PM IST

'అఖండ' విజయంతో ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం షూటింగ్​లలో బిజీగా ఉన్నారు. అయితే బాలయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..

బాలయ్య 20 ఏళ్ల క్రితమే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్​లో జానపద సినిమా ప్రారంభించి చేసి మధ్యలోనే ఆపేశారు. దానికి 'విక్రమ సింహ భూపతి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. బాలయ్యతో పలు సూపర్ హిట్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి.. దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారట! త్రిపురనేని మహారథి రచయిత కాగా.. సంగీత దర్శకుడిగా 'మ్యాస్ట్రో' ఇళయరాజా, ఛాయాగ్రహుడిగా కబీర్ లాల్‌ను తీసుకున్నారట. కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత పలు కారణాలతో దాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం దీని గురించి సోషల్​మీడియాలో కథనాలు కనపడుతున్నాయి. ఇంతకీ ఎందుకు ఆపేశారంటే..

విక్రమ సింహ భూపతి

ఇదే ఆ కథ.. 'బాహుబలి'ని మించిన ఆ సినిమా కథ విక్రమ సింహ భూపతి.. అంటూ ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య 'విక్రమ సింహ భూపతి', 'ప్రతాప వర్మ' అనే తండ్రీకొడుకుల క్యారెక్టర్లు చేశారట. ప్రతాప వర్మ తన నానమ్మతో కలిసి ఓ అడవిలోని గూడెంలో ఉంటారు. కొందరు బందిపోటు దొంగలు ఆ గూడాన్ని దోచుకోవడానికి వస్తారు. ప్రతాప వర్మను చూసి షాక్ అయ్యిపోతారు. అసలేం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్‌లో రివీల్ అవుతుంది.

'విక్రమ సింహ భూపతి' ఓ సామ్రాజ్యానికి రాజు.. అతని కుమారుడే యువరాజు ప్రతాప వర్మ. విక్రమ సింహ భూపతిని నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచి హతమారుస్తారు. ఆ పరిస్థితుల్లో విక్రమ సింహ భూపతి తల్లి.. మనవడిని తీసుకుని అడవిలోని గూడానికి వెళ్లిపోతుంది. తండ్రి గురించి తెలుసుకున్న ప్రతాప వర్మ తిరిగి ఆ రాజ్యానికి వెళ్లి, తన తండ్రిని చావుకి కారణమైన వాళ్లని ఎలా శిక్షించాడు? సింహాసనాన్ని ఎలా దక్కించుకున్నాడు? అనే సంఘటనలతో ఈ కథ అనుకున్నారట.

ఆ కారణంగా.. 2001లో షూటింగ్ ప్రారంభించారట. రెండు పాటలతో సహా సగం సినిమా కంప్లీట్ అయిందట. విక్రమ సింహ భూపతికి జోడీగా రోజా, ప్రతాప వర్మకి జంటగా లీసారే (టక్కరిదొంగ ఫేమ్), పూజా బాత్రాలను తీసుకున్నారు. తర్వాత లీసారే ప్లేసులోకి 'సమరసింహా రెడ్డి' భామ అంజలా జవేరిని తీసుకున్నారు. బాలయ్య బామ్మగా సీనియర్ నటి భానుమతి రామకృష్ణను ఎంపిక చేశారు. ఆమె అనారోగ్యానికి గురవడం వల్ల కె.ఆర్.విజయను తీసుకున్నారు. ఇలా అంతా జరిగాక.. కొన్ని సెంట్​మెంట్స్​ కారణంగా నిర్మాత గోపాల్ రెడ్డి దీన్ని ఆపేశారట.

ఆ తర్వాత బాలయ్య 'సీమసింహం' చేయడం.. కోడి రమకృష్ణ మరో చిత్రానికి షిప్ట్ అవ్వడం, నిర్మాత గోపాల్ రెడ్డి కూడా కాస్త అనారోగ్యానికి గురవ్వడం వల్ల 'విక్రమ సింహ భూపతి' పూర్తిగా ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా కనుక అనుకున్నట్లు తెరకెక్కించి ఉంటే 'బాహుబలి' రేంజ్ సినిమా అయ్యి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: వెంకటేష్‌-షిర్లీ సేతియా అదరగొట్టేశారుగా!

ABOUT THE AUTHOR

...view details