Bala Krishna 200 Days Movies : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసిన మూవీ 'వీరసింహారెడ్డి'. నందమూరి నట సింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంది. బాలయ్య డ్యూయెల్ రోల్లో మెరిసిన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ అందుకుని కాసుల వర్షాన్ని కురిపించింది.
అయితే ఈ సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును అందుకుంది. సుమారు 200 రోజుల పాటు ఒక్క థియేటర్‌లో నిర్విరామంగా రోజుకు నాలుగు షోల పాటు ఆడుతూ.. ఇండస్ట్రీలో ఓ నయా రికార్డును తిరగరాసింది. జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 21 నాటికి 100 రోజుల మార్క్‌ను దాటగా.. ఈ శక్రవారంతో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలోని అలూరిలో ఎస్ఎల్ఎన్ఎస్ థియేటర్‌లో ఈ 200 రోజుల మైలురాయిని అందుకుంది.
Balakrishna Movies : అయితే నట సింహం బాలకృష్ణకు ఇలాంటి ఘననతు సొంతం చేసుకోవడం కొత్తమీ కాదు. ఆయన నటించిన పలు సినిమాలు ఈ రికార్డును ఎప్పుడో నమోదు చేశాయి. అలా ఒకటి కాదు రెండు కాదు 'వీరసింహారెడ్డి'తో కలిపి ఈ లిస్ట్‌లో ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో 'మంగమ్మ గారి మనవడు', 'లెజెండ్','సింహా', 'నరసింహ నాయుడు', 'సమర సింహారెడ్డి'లు సుమారు 200 రోజుల పాటు ఆడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాలు ఇలా 200 రోజుల పాటు ఒకే థియేటర్‌లో ఆడటం ఓ అరుదైన రికార్డ్. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్న ఏకైక హీరో బాలయ్యనే కావడం విశేషం. ఒకే థియేటర్‌లో కాకుండా షిష్టుల వారిగా కూడా బాలకృష్ణ సినిమాలు నిర్విరామంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. 'ముద్దులకృష్ణయ్య' 'ముద్దులమావయ్య' 'అనసూయమ్మ గారి అల్లుడు', 'మువ్వ గోపాలుడు' లాంటి సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
Bhagwant Kesari Movie : ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమాలో నటిస్తున్నారు. భారీ యాక్షన్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారు. ఇక ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. యంగ్ అండ్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.