తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు - బలగం అంతర్జాతీయ ఫిల్మ్​ ​

'బలగం' సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. వేణుకు బెస్ట్ డైరెక్టర్​ పురస్కారం దక్కింది. ఆ వివరాలు..

Balagam award
'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు

By

Published : Apr 7, 2023, 11:53 AM IST

Updated : Apr 7, 2023, 12:16 PM IST

సినిమా చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి క్రమక్రమంగా మారుతూ వస్తోంది. కమర్షియల్​ సినిమాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే ఆడియెన్స్​ ఇప్పుడు ఆ చిత్రాలతో పాటు కంటెంట్​, నేచురాలిటీగా ఉన్న చిత్రాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి సహజ సిద్ధమైన కథలు మెల్లమెల్లగా పుట్టుకొస్తున్నాయి. దర్శకులు కొత్త ఎక్స్​పెరిమెంట్లు చేస్తూ.. స్వచ్ఛమైన కథలతో చిత్రాలను చేయడం ప్రారంభిస్తున్నారు. రీసెంట్​గా అలా వచ్చిన చిత్రమే 'బలగం'. తెలంగాణ ప్రాంతంలోని సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తన తొలి చిత్రంగా రూపొందించారు.

అయితే ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్​రాజు బ్యానర్​లో రూపొందడంతో బాగా హైప్​ వచ్చింది. రిలీజ్​ అయ్యాక హిట్ టాక్​తో ఆడియెన్స్​కు మరింత దగ్గరైంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్​ ముందు మంచి వసూళ్లను అందుకుంది. ఇక డిజిటల్ ప్లాట్​ఫామ్​ అయిన ఓటీటీలోనూ విశేష ఆదరణను దక్కించుకుంది. రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డుల రావడం మొదలుపెట్టాయి. అలా చిన్న సినిమాగా విడుదలై విశేష ఆదరణను దక్కించుకున్న ఈ సినిమా.. ఇప్పుడు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ హవా కొనసాగిస్తోంది. తాజాగా అరౌండ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌-ఆమ్‌స్టర్‌డామ్‌ కార్యక్రమంలో మరో పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి విభాగంలో వేణు దీనిని దక్కించుకున్నారు. యూకే, యూఎస్‌, చైనా.. ఇలా పలు దేశాలకు చెందిన సినిమాలు, డైరెక్టర్స్​ను వెనక్కి నెట్టి వేణు ఈ అవార్డును అందుకోవడం విశేషం. దీనిపై సినీప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 'బలగం' ఇప్పటికే 'వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌', 'ఒనికో ఫిల్మ్‌ అవార్డు' వంటి పలు విదేశీ అవార్డులు అందుకుంది. మొత్తంగా తాజాగా వచ్చిన అవార్డుతో కలిపి 'బలగం' ఖాతాలో ఏకంగా తొమ్మిది పురస్కారాలు చేరాయి.

ఇకపోతే ఈ 'బలగం' సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఇకపోతే తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో.. కుటుంబ పెద్ద చనిపోయాక ఏర్పడిన పరిస్థితుల చుట్టూ ఈ కథను తెరకెక్కించారు. అలాగే చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువలను చాలా బాగా చూపించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.

ఇదీ చూడండి:మృణాల్​ ఠాకూర్​ గ్యాప్​ ఇవ్వట్లేదుగా.. బికినీలో బాంబు పేలుస్తూ..!

Last Updated : Apr 7, 2023, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details