తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Balagam Actor Died : 'బలగం' నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు ఎమోషనల్​ - బలగం నటుడు కీసరి నర్సింగం మృతి

Balagam Actor Died : 'బలగం'లో ఓ కీలక పాత్ర పోషించిన నర్సింగం తుదిశ్వాస విడిచారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర దర్శకుడు వేణు సంతాపం తెలిపారు. .

Balagam Actor Died : 'బలగం' నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు ఎమోషనల్​
Balagam Actor Died : 'బలగం' నటుడు కన్నుమూత.. దర్శకుడు వేణు ఎమోషనల్​

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 7:16 PM IST

Updated : Sep 5, 2023, 7:47 PM IST

Balagam Actor Died : విశేష ప్రేక్షకాదరణ పొందిన 'బలగం' చిత్రంలో సర్పంచి పాత్ర పోషించిన కీసరి నర్సింగం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు నటుడు, ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి. ఈ సినిమా కథ కోసం రీసెర్చ్‌ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు. "మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించారు నాకోసం.." అని వేణు పేర్కొన్నారు.

కాగా, నర్సింగం మృతికి గల కారణాన్ని దర్శకుడు వేణు చెప్పలేదు. అనారోగ్యం కారణంగానే నర్సింగం తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఇక ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు కూడా నర్సింగం మృతిపై సంతాపం తెలుపుతన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

ఇకపోతే పలు చిత్రాలు, 'జబర్దస్త్‌' షోతో తెలుగు ప్రేక్షకులు మంచి వినోదం అందించిన హాస్య నటుడు వేణు యెల్దండి. బలగం చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సత్తా చాటారు. మంచి విజయాన్ని అందుకున్నారు. కుటుంబ విలువలు ఇతివృత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో 'బలగం' సినిమా రూపొందింది. ఈ చిత్రానికి 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు(Balagam movie awards) దక్కిన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోనే నర్సింగంతో పాటు మరికొందరు కళాకారులకు వేణు అవకాశం కల్పించి, వారికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఇంకా ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, రూపా లక్ష్మి, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Balagam Director Venu Yeldandi New Movie : ప్రస్తుతం వేణు నుంచి ఎలాంటి సినిమా రాబోతుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన ఈ మధ్యే తన కొత్త సినిమాకు సంబంధించి కథను రాయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

'బలగం' డైరెక్టర్​ వేణు కొత్త సినిమా అప్డేట్​

'బలగం'కు మరో అంతర్జాతీయ అవార్డు.. బెస్ట్​ డైరెక్టర్​గా వేణు

Last Updated : Sep 5, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details