Nandamuri heroes కరోనా, నిర్మాణ వ్యయాలు, టికెట్ ధరలు, ఓటీటీలో సినిమాల విడుదల, ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం.. ఇలా పలు రకాల సమస్యల వల్ల చిత్రసీమ కుదేలైంది. ఈ కారణాలతో పలువురు హీరోలు విజయాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టారు. ఒకవేళ కథ బాగున్నా కలెక్షన్లు రాక నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. అయితే ఈ సమస్యలు నందమూరి హీరోలపై ప్రభావం చూపలేకపోయాయి. పైగా వీరు.. తమ చిత్రాలతో తిరిగి చిత్రసీమకు ఊపిరిపోశారనే చెప్పాలి.
రెండో దశ లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా అని భయపడుతున్న నేపథ్యంలో బాలయ్య 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుని సినీపరిశ్రమలో ధైర్యాన్ని నింపారు. దీంతో ప్రేక్షకులు థియేటర్‌వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్'తో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనలోని పూర్తి నటనను బయటకు తీసి సంచలన విజయాన్ని అందుకోవడం సహా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత కొన్ని సమస్యల వల్ల మళ్లీ వీక్షకులు సినిమా హాళ్లవైపు రావడం మానేశారు. దీంతో చిత్రసీమ మళ్లీ బోసిపోయింది. అయితే మళ్లీ కల్యాణ్‌రామ్ బింబిసారుడిగా వచ్చి థియేటర్లను హౌస్‌ఫుల్ అయ్యేలా చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఈ మూడు చిత్రాల విజయాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ మూడు సినిమాలు ఒక కామన్ పాయింటో సక్సెస్‌ను సాధించడం విశేషం. అదే పాప సెంటిమెంట్.
అసలు వివరాల్లోకి వెళ్తే.. నిజానికి టాలీవుడ్లో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తుంటారు. ఏ సినిమా మొదలు పెట్టినా ముహూర్తం నుంచి గుమ్మడి కాయ కొట్టి.. సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయ్యేంత వరకు సెంటిమెంట్లు ఫాలో అవుతూ వుంటారు. అయితే మన నందమూరి హీరోల విషయంలో మాత్రం పాప సెంటిమెంట్.. యాధృచికంగా జరిగిందో లేదా అనుకున్నారో కానీ.. బాగా వర్కౌట్ అయింది.