తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సినీనటులకు అవార్డులు ఆక్సిజన్‌ లాంటివి'

నటీనటులకు నంది అవార్డులు ఇవ్వకపోడవంపై స్పందించారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. అవార్డులు నటులకు అవార్డులు ఆక్సిజన్‌ లాంటివన్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో ఉగాది సినిమా పురస్కారాల వేడుక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మురళీమోహన్​.

Awards for celebrities are like oxygen
'సినీనటులకు అవార్డులు ఆక్సిజన్‌ లాంటివి'

By

Published : Apr 2, 2022, 10:56 PM IST

సినీ నటులకు అవార్డులు ఆక్సిజన్‌ లాంటివని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఉగాది సినిమా పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. ఈసందర్భంగా 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. స్టూడియో సెక్టార్‌ నుంచి రమేష్ ప్రసాద్‌కు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వాలు నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని పక్కన పెట్టాయి. ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేదు. ప్రైవేటు సంస్థలు మాత్రమే నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయి’’ అని అన్నారు. నటుడు బ్రహ్మానందం, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆసక్తికరంగా రిలీజ్‌ టీజర్‌ విక్రాంత్‌ రోణ..

కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘విక్రాంత్‌ రోణ' విడుదల తేదీ ఖరారైంది. కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. అనూప్‌ భండారి తెరకెక్కించారు. ఈ సినిమాని జులై 28న 3డీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విభిన్నమైన యాక్షన్‌ అడ్వెంచర్‌ కథాంశంతో.. త్రీడీలో రూపొందించిన చిత్రమిది. 14 భాషల్లో.. 55 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలందించారు. విలియమ్‌ డేవిడ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. చిన్న పిల్లలందరూ కలిసి డైరీ గురించి అందులోని వ్యక్తిగురించి మాట్లాడుకోవటం ఆసక్తికరంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details