తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మంచు తుపానులో గాయపడ్డ 'అవెంజర్స్​' స్టార్​​.. పరిస్థితి విషమం - జెరెమి రెన్నర్​ పరిస్థితి విమమం

అమెరికాలో కురుస్తున్న మంచు తుపాను కారణంగా.. అవెంజర్స్​, కెప్టెన్​ అమెరికా ఫేమ్​ స్టార్​ యాక్టర్​ జెరెమి రెన్నర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జెరెమి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Avengers star Jeremy Renner critical after snow ploughing accident
మంచు తుపానులో గాయపడ్డ 'అవెంజర్స్​' స్టార్​​.. పరిస్థితి విషమం

By

Published : Jan 2, 2023, 5:19 PM IST

మంచు తుపాను కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. మంచు.. రోడ్లను దట్టంగా కప్పేసింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆ మంచును తొలగించటానికి అక్కడి ప్రజలు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంచును తొలగిస్తూ హాలీవుడ్‌ స్టార్ యాక్టర్​, అవెంజర్స్​ ఫేమ్​ జెరెమి రెన్నర్‌ గాయాల పాలయ్యాడు. తన భారీ వాహనంతో మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడని తెలిసింది. తీవ్రంగా గాయపడ్డాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో వెంటనే స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అతడికి ఐసూయూలో చికిత్స అందిస్తున్నారట. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కానీ ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. రెన్నర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇకపోతే రెన్నర్ రెండు సార్లు ఆస్కార్‭కు ఎంపికయ్యారు. 'అవెంజర్స్', 'కెప్టెన్ అమెరికా', 'మిషన్: ఇంపాజిబుల్' సిరీస్, 'అరైవల్', ' అమెరికన్ హస్టిల్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ది హర్ట్ లాకర్‭లో తన నటనకు 2010 అకాడమీ అవార్డ్స్‭లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలాగే ది టౌన్‭లో తన పాత్రకు ఉత్తమ సహాయనటుడిగా కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతడు పారామౌంట్ ప్లస్‭లో స్ట్రీమింగ్ అవుతున్న మేయర్ ఆఫ్ కింగ్స్ టౌన్‭లో నటిస్తున్నాడు. ఈ నెలలో రెండో సీజన్ కూడా ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:ఆడియెన్స్​కు బంపర్ ఆఫర్​.. ఆ సినిమా చూస్తే లక్ష రూపాయలు.. కానీ!

ABOUT THE AUTHOR

...view details