తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Avatar 2 OTT : ఆ ఓటీటీలోకి 'అవతార్‌ 2'.. రెంట్‌ లేకుండానే.. - అవతార్ 2 ఓటీటీ డిస్నీ హాట్ స్టార్​

Avatar 2 OTT : ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికన పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో సందడి చేసిన 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' చిత్రం ఆ ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. రెంట్‌ చెల్లించకుండానే ఈ సినిమాను చూసేలా సదరు సంస్థ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఆ వివరాలు..

Avatar 2 ott release date
Avatar 2 OTT : ఆ ఓటీటీలోకి 'అవతార్‌ 2'.. రెంట్‌ లేకుండానే..

By

Published : May 16, 2023, 6:56 AM IST

Updated : May 16, 2023, 8:41 AM IST

Avatar 2 The Way Of Water OTT : హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి 'అవతార్‌ 2 : ది వే ఆఫ్‌ వాటర్‌'. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం.. తొలి భాగం 'అవతార్‌'లానే పలు రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత 2023 మార్చి 28 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన యాపిల్‌ టీవీ, మూవీఎస్‌ ఎనీ వేర్‌, వుడు, ప్రైమ్‌ వీడియో, గూగుల్‌ప్లే, ఎక్స్‌ఫినిటీ, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. అలా ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికన పలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో సందడి చేసిన ఈ సీక్వెల్​.. ఇప్పుడు ఓటీటీ 'డిస్నీ+హాట్‌స్టార్‌'లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అది కూడా రెంట్‌ చెల్లించకుండానే ఈ సినిమాను సదరు సంస్థ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనుంది. ఈ విజువల్‌ వండర్‌ను జూన్‌ 7న రిలీజ్​ చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటివరకు ఎదురు చూడలేమని కొందరు కామెంట్లు పెడుతుంటే.. 'వావ్‌', 'సర్‌ప్రైజ్‌ అదిరింది' అని మరికొందరు అంటున్నారు. ఏయే భాషల్లో స్ట్రీమింగ్‌ కాబోతుందని అడుగుతున్నారు. అయితే ఎన్ని భాషల్లో రిలీజ్​కానుందన్న విషయాన్ని మాత్రం 'డిస్నీ+హాట్‌స్టార్‌' ఇంకా చెప్పలేదు.

ఇదీ కథ.. తొలి భాగంలో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్టన్‌).. అక్క‌డ నావి తెగ‌కి చెందిన నేతిరిని(జో స‌ల్దానా) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత జేక్ ఆ తెగ‌కి నాయ‌కుడ‌వుతాడు. అనంతరం ఈ జంట.. లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌ల్ని క‌ంటారు. అలాగే ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో పిల్లాడితో క‌లిసి హాయిగా జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని.. ఎలాగైనా పండోరాను ఆక్ర‌మించి అక్క‌డున్న నావీ తెగ‌ని అంతం చేయాలని.. మ‌నుషులు మ‌రోసారి వారిపైకి దండెత్తుతారు. దీంతో జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం.. ఈ సారి మెట్క‌యినా ప్రాంతానికి వలస వెళ్తాడు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు స‌ముద్ర‌మే ప్ర‌పంచం. సముద్రంతోనే జీవితం ముడిపడి ఉందని న‌మ్ముతూ నీటిలోనే బ‌తుకుతుంటారు. అయితే మెట్కయినా రాజు టోనోవ‌రి స‌హ‌కారంతో.. జేక్ ఫ్యామిలీ కూడా స‌ముద్రంతోనే అనుబంధం పెంచుకుంటుంది. ఎంత కష్టమైనా అక్క‌డ జీవనం సాగిస్తుంటుంది. అయితే ఎలాగైనా జేక్‌ని అతడి కుటుంబాన్ని చంపాలని.. భూమి నుంచి వ‌చ్చిన మెయిన్ విలన్​ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌), అత‌డి టీమ్​తో కలిసి పోరాటం ఎలా చేశారనేదే మిగ‌తా క‌థ‌.

ఇదీ చూడండి:'NTR 30'కి​ అదిరిపోయే టైటిల్​.. ఫ్యాన్స్​కు పూనకాలే.. రివీల్​ అప్పుడే!

Last Updated : May 16, 2023, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details