Avatar Sequels James Cameron: ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిత్రం 'అవతార్'. హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అద్భుతాన్ని ఇంకా ఇంకా చూడాలనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమాకు మరో నాలుగు సీక్వెల్స్‌ను ప్రకటించారు కామెరూన్. అందులో భాగంగానే రెండో సీక్వెల్‌గా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'ను తీర్చిదిద్దుతున్నారు. అలానే మూడో భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. అలా రెండో భాగానికి సంబంధించిన తొలి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌తో రుచి చూపించారు జేమ్స్.
జేమ్స్ కామెరూన్ సంచలన నిర్ణయం.. అలా జరిగితే అవతార్ సీక్వెల్స్ లేనట్టేనట - అవతార్ కామెరూన్ నిర్ణయం
'అవతార్' సినిమా రూపంలో ప్రపంచ సినీ ప్రియులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలా జరిగితే తదుపరి సీక్వెల్స్‌ను తెరకెక్కించనని ప్రకటించారు. కామెరూన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు షాక్ అవుతున్నారు.
తాజాగా 'అవతార్' సీక్వెల్స్‌పై దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రిలీజ్ కానున్న'అవతార్-2' ఫ్లామ్ అయితే మాత్రం తదుపరి సీక్వెల్స్ 4,5 తెరకెక్కించనని ప్రకటించారు. చెప్పాలంటే ఇది సంచలన నిర్ణయమైనా.. కొన్ని పరిస్థితుల్లో తప్పదని వెల్లడించారు. కాగా, ఇప్పటికే 'అవతార్-3' సీక్వెల్‌ను 2024 డిసెంబర్ 20న, 'అవతార్-4'ను 2026 డిసెంబర్ 18న, అవతార్-5ను 2028 డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్టు కామెరూన్ ప్రకటించారు. కానీ కామెరూన్ తాజా వ్యాఖ్యలతో 'అవతార్' అభిమానులంతా షాక్ అవుతున్నారు. కఠిన నిర్ణయమే తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఇటీవలే విడుదలైన 'అవతార్-2' ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. దర్శకుడు చూపించిన అందాల్ని, అద్భుతాల్ని చూసి సినీప్రియులు అవాక్కవుతున్నారు. సముద్ర గర్భంలో సాగే సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం కామెరూన్ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారట. మరోవైపు 'అవతార్-2' చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ విడుదల చేయనున్నారు.