తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చరిత్ర సృష్టించిన 'అవతార్​-2'.. భారత్​లో తొలి చిత్రంగా రికార్డ్​! - అవతార్​ 2 భారత్​ రికార్డ్​

జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన 'అవతార్-2' చిత్రం.. భారీ వసూళ్లతో భారత్​లో రికార్డు సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్​ సినిమాగా నిలిచింది. ఆ వివరాలు..

avatar 2
avatar 2

By

Published : Jan 22, 2023, 6:29 PM IST

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2' భారత్​లో రికార్డులు సృష్టిస్తోంది. అవతార్‌లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు కామెరూన్​. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన 'అవతార్‌-ది వే ఆఫ్ వాటర్'(అవతార్‌-2) ప్రస్తుతం అన్ని రికార్డులను తిరగరాసింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది.

కాగా, 'అవతార్-2'.. భారత్​లో రూ.368.20 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది. అంతకుముందు 'ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రూ.367 కోట్లు వసూళ్లు సాధించగా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

అవతార్-2 కేవలం 14 రోజుల్లోనే బాక్సాఫీస్ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటింది. 2022లో విడుదలైన 'టాప్ గన్: మావెరిక్','జురాసిక్ వరల్డ్ డొమినియన్' సరసన నిలిచింది అవతార్-2. దీంతో 2022లో విడుదలైన ఇతర సినిమాల కంటే జేమ్స్ కామెరూన్ చిత్రం ఈ మైలురాయిని వేగంగా అధిగమించి రికార్డు సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details