Avatar 2 OTT Release : సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల కళ్లముందు ఆవిష్కరించింది అవతార్ చిత్రం. దర్శకుడు జేమ్స్ కామెరూన్ మేధోమథనం నుంచి పుట్టిన పండోరా ప్రపంచం వీక్షకుల మదిని దోచుకుంది. ఇటీవల అవతర్ 2 దాదాపు 160 భాషల్లో విడుదలై.. అద్భుత విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వరల్డ్ వైడ్‌గా రికార్డులు బద్దలుగొడుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ గానీ, ఓటీటీ సంస్థ గానీ అధికారికంగా స్పందించలేదు.
Avatar 2 OTT Release : ఓటీటీలోకి అవతార్ 2 అప్పుడే.. స్ట్రీమింగ్ తేది అదే..? - avatar 2 boxoffice
Avatar 2 OTT Release : సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అవతార్ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
అయితే, అవతార్ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 21 సెంచరీ ఫాక్స్ అనే మీడియా కంపెనీ సొంతం చేసుకుంది. ఈ కంపెనీని 2017లో వాల్డ్ డిస్నీ సంస్థ 52.4 బిలియన్ డాలర్లకు కొనగోలు చేసింది. దీంతో అవతార్ 2 సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవడం లాంఛనమేనని సినీ వర్గాల సమాచారం. అయితే సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు.. దాదాపు 60 రోజుల్లోగా ఓటీటీలోకి వస్తాయి. కానీ అవతార్ విషయంలో ఒక ఒప్పందం ప్రకారం దాదాపు 200 రోజుల తర్వాత ఒటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం, ఏప్రిల్ 2023లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడించేవరకు ఈ విషయంపై స్పష్టత రాదు.
మొదటి రోజు నుంచి హిట్ టాక్ అందుకుని ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొడుతోంది అవతార్-2. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి వారాంతంలో రూ. 56 కోట్ల గ్రాస్ తో పాటు రూ. 34 కోట్ల షేర్ కూడా వసూల్ చేసింది. ఈ మేరకు బాక్సాఫీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.