తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అవతార్ 2' కోసం పనిచేసిన అవసరాల శ్రీనివాస్! - అవతార్ 2 అవసరాల శ్రీనివాస్​

'అవతార్ 2' తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారని తెలిసింది. ఆ వివరాలు..

Avatar 2 Avasarala srinivas
'అవతార్ 2' కోసం రంగంలోకి అవసరాల శ్రీనివాస్.. ఆయన ఏం చేశారంటే?

By

Published : Dec 13, 2022, 2:03 PM IST

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమా సీక్వెల్‌గా అవతార్-‌2 ది వే ఆఫ్‌ వాటర్‌ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ 16న ఈ చిత్రం విడుదలవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్​ వరంగా వండర్స్ క్రియేట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్​కు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ కూడా రిలీజ్ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్​గా మారింది. అదేంటంటే.. 'అవతార్ 2' తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారని అంటున్నారు. తెలుగు డైలాగ్స్ అన్ని ఆయనే రాశారని సోషల్​మీడియాలో ప్రచారం సాగుతోంది.

కాగా, అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్‌.. రెండో భాగంలో సముద్ర గర్భంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే చిత్రబృందం నిర్వహించిన ప్రమోషనల్‌ టూర్‌లో నిర్మాత జోన్‌ లాండౌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. "అవతార్‌ ఐదో భాగం 2028లో వచ్చే అవకాశం ఉంది. అందులో సినిమాలోని పాత్రలన్నీ ఒక మంచిపని కోసం భూమి పైకి వస్తాయి" అని చెప్పారు.

ఇదీ చూడండి:NTR 30: తారక్​ రోల్​పై ఇంట్రెస్టింగ్​ అప్డేట్​.. ఎక్స్​ట్రా ఫింగర్ ఎలిమెంట్​తో

ABOUT THE AUTHOR

...view details