తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అవెంజర్స్'​ రికార్డులను బద్దలకొడుతున్న అవతార్​.. 2 బిలియన్​ క్లబ్​లో టాప్​ స్కోర్​..! - అవతార్​ 2 ఇంటర్నేషనల్​ బాక్సాఫీస్ కలెక్షన్స్​

'టైటానిక్' దర్శకుడు​ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక మూవీ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమా సంచలన రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలుకొట్టే దిశగా ప్రయాణిస్తోంది.

Avatar the way of Water
Avatar the way of Water

By

Published : Jan 27, 2023, 6:27 PM IST

దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్'. 2009లో రిలీజైన సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించగా.. 2022లో వచ్చిన పార్ట్​ 2 'ది వే ఆఫ్ వాటర్' సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ చిత్రం మరిన్ని రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రముఖ మార్వెల్ సినిమా 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్​', 'స్పైడర్​ మ్యాన్​ నో వే హోమ్​' రికార్డులను బ్రేక్ చేసింది.

2022 డిసంబర్​లో రిలీజైన 'అవతార్ 2' గ్లోబల్​ బాక్సాఫీస్ ముందు 2.054 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలా 2018లో విడుదలైన 'ఇన్ఫినిటీ వార్' (2.052 బిలియన్ డాలర్లు), 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్'(1.92 బిలియన్ డాలర్లు) రికార్డులను అధిగమించింది. ఈ మార్క్​తో ప్రపంచంలోనే అత్యథిక గ్రాసింగ్​ మూవీస్ లిస్ట్​లో టాప్-5లో చోటు దక్కించుకుని ఐదో స్థానంలో నిలిచింది.

మరో వైపు ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 603 మిలియన్ డాలర్లను సాధించగా.. అంతర్జాతీయ స్థాయిలో 1.5 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. దీంతో సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన నాలుగో చిత్రంగానూ నిలిచింది. గ్లోబల్​ బాక్సాఫీస్​ ముందు 2 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఆరో చిత్రంగానూ 'ది వే ఆఫ్​ వాటర్​' గుర్తింపు తెచ్చుకుంది. అది కూడా విడుదలైన ఆరు వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details