సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అవతార్ 2' సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 52 వేలకుపైగా స్క్రీన్స్‌లో ఈ చిత్రం గ్రాండ్ విడుదలైంది. అయితే ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్ ఈ చిత్రం షూటింగ్లో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని తెలిపింది. ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని పేర్కొంది. దీంతో ఆమె హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రికార్డ్ బ్రేక్ చేసినట్టైంది. మిషన్ ఇంపాజిబుల్.. రోగ్ నేషన్ సెట్లో టామ్ దాదాపు ఆరు నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నారు.
అవతార్ 2 కోసం నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానని.. ఆ సమయంలో తాను చనిపోయానని అనుకుని అరిచానని.. ఇందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చింది విన్స్లెట్. చివరగా 7 నిమిషాల 15 సెకన్లు ఊపిరి తీసుకోకుండా ఉండడం చూసి తనను తాను నమ్మకలేకపోయానని వెల్లడించింది.