తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అవతార్‌-2 కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించా.. ఆయనలా ఆగిపోదామనుకున్నా' - స్టీవెన్​ స్పీల్​ బర్గ్​

అవతార్‌2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కోసం జేమ్స్‌ కామెరూన్‌ ఎంత కష్టపడ్డారో చెప్పారు. అవతార్​ సీక్వెల్​ విషయంలో చాలా ఆలోచించానని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

avatar 2
avatar 2

By

Published : Dec 16, 2022, 7:00 PM IST

ప్రస్తుతం అవతార్‌2 సినిమా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సినీ ప్రియులు జై కొట్టారు. వయసుతో సంబంధం లేకుండా అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లాడు ఈ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కామెరూన్. సినిమా విజయంపై స్పందిస్తూ ఓ ప్రముఖ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు.

'2009లో విడుదలైన అవతార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆ సినిమా తర్వాత అందరూ దానికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని భావించారు. ఇలా సీక్వెల్స్‌ తెరకెక్కించాలని ఒక్కసారిగా అనుకున్నది కాదు. కొన్ని సంవత్సరాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా ఆత్మపరిశీలన చేసుకొని.. నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత మొదలుపెట్టా.. ఇప్పుడు అవతార్ సీక్వెల్స్‌ అన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 1982లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్ సినిమా తీశారు. అది మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆయన దానికి సీక్వెల్‌ తీయలేదు. నేను అలా ఆగిపోదాం అని అనుకోవడం లేదు' అని ఆయన స్పష్టం చేశారు.

'ఈరోజు విడుదలైన అవతార్‌ సినిమా అద్భుతమైన కమర్షియల్‌ హిట్‌ను అందుకుంది. 'టైటానిక్' తర్వాత బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రకృతితో మానవులకు ఉన్న సంబంధం చాలా గొప్పది. దానినే నేను అవతార్‌లో చూపించాను. ఈ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ప్రేక్షకులు ధియేటర్లో సినిమా చూసేటప్పుడు మా కష్టమంతా వాళ్లకి కనిపిస్తుంది. నేను ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించాను. ప్రతి విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి ఆడియన్స్‌కు అందించాం' అని అవతార్‌ విజయంపై జేమ్స్‌ కామెరూన్‌ ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details