తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అవతార్​ 2'కు కొత్త టైటిల్​.. భారత్​లో రిలీజ్​ ఎప్పుడంటే? - అవతార్​ 2 మూవీ కలెక్షన్స్​

Avatar 2 release date and title: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్​ 2' ఇండియా రిలీజ్​ డేట్​ వచ్చేసింది. దీంతో పాటే ఈ చిత్రానికి ఓ కొత్త టైటిల్​ను కూడా ఖరారు చేశారు. ఆ వివరాలు...

avatar 2 movie release date
అవతార్​ 2 రిలీజ్ డేట్​

By

Published : Apr 28, 2022, 1:30 PM IST

Avatar 2 release date and title: సినిమా అభిమానులకు పండోరా అనే కొత్త లోకాన్ని పరిచయం చేసిన చిత్రం 'అవతార్‌'. 2009లో విడుదలైంది. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వం వహించారు. దశాబ్దంపైనే గడిచినా ఆ జ్ఞాపకాలు ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా వస్తున్న 'అవతార్‌ 2' చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ పండోరాలో నివాసం ఏర్పరచుకున్నాకా మానవజాతితో ఎలా పోరాడారు? పండోరా జాతిని ఎలా రక్షించారు అన్నది ఈ సీక్వెల్‌లో చూపించనున్నారు. క్రిస్‌మస్‌ కానుకగా భారత్​లో ఈ ఏడాది డిసెంబరు 16న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో డిసెంబరు 14న రిలీజ్​ కానున్నట్లు తెలిపింది. అలాగే ఈ చిత్రానికి టైటిల్​ కూడా ఖరారు చేసింది. 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్'​ అని పేరు పెట్టింది. అలానే అవతార్​ తొలి భాగాన్ని సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేక వీడియో ద్వారా తెలిపింది.

సరికొత్త సాంకేతికతతో.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 భాషల్లో విడుదల చేయనున్నారు. త్రీడీలోనే కాకుండా 4కె, లైవ్‌ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటి మరింత అత్యాధునిక సాంకేతికత అంశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జేమ్స్‌ కామెరూన్‌ ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీ పరంగానే ఈ సినిమాకు పలు వెర్షన్‌లు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, అత్యాధునిక సాంకేతికతో వస్తున్న 'అవతార్‌ 2'ను ప్రదర్శించేలా తమ థియేటర్లను ఆధునికీకరిస్తామని సినిమాకాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న థియేటర్ల యాజమానులు వెల్లడించారు.

ఇదీ చూడండి: Avatar 2 movie: 160 భాషల్లో 'అవతార్-2'.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

ABOUT THE AUTHOR

...view details