హాలీవుడ్ దర్శకధీరుడు జేమ్స్ కామెరూన్ 'అవతార్' సినిమాకు ప్రపంచమంతటా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే రిలీజైన పార్ట్ వన్.. వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. తాజాగా వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సైతం వసూళ్లలో దూసుకెళ్తోంది. తాజా లెక్కల ప్రకారం ఉత్తర అమెరికాలో ఈ చిత్రం.. రూ.7,145 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.11,600 కోట్లు వసూలు చేసింది. ఈ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టిక్కెట్ అమ్ముడైన చిత్రాల జాబితాలో 14వ స్థానానికి చేరింది అవతార్-2. "బ్లాక్ పాంథర్", "హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2" సినిమాలను "అవతార్ 2" వెనక్కి నెట్టింది. 2022లో విడుదలై అత్యధిక వసూళ్లను సాధించిన పారామౌంట్, టాప్ గన్:మావెరిక్ చిత్రాలను అధిగమించేందుకు సిద్ధమైంది.
అవతార్ 2కు కలెక్షన్ల పంట.. అన్ని రికార్డులు బ్రేక్.. రూ.12వేల కోట్ల దిశగా.. - అవతార్ 2 లేటెస్ట్ అపేట్స్
జేమ్స్ కామెరున్ తెరకెక్కించిన అవతార్-2 కలెక్షన్లలో దూసుకెళ్తోంది. డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎంతంటే?
భారత్‌లోనూ అవతార్ జోరు..
భారత్‌లోనూ అవతార్ జోరు ఏమాత్రం తగ్గలేదు. డిసెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద 40.50 కోట్ల రూపాయలను రాబట్టింది. తొలిరోజు రూ.53.10 కోట్లు రాబట్టిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' (2019) టాప్ ప్లేస్‌లో ఉంది. దీంతో భారతీయ మార్కెట్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతార్ 2 రెండోస్థానంలో నిలిచింది. కాగా, సోమవారం సుమారు రూ.7 కోట్లు వసూలు చేయగలిగింది. దీంతో మొత్తం కలెక్షన్స్ రూ.340.75కోట్లకు చేరాయి. రిలీజైన 18 రోజుల తర్వాత కూడా ఇంత మొత్తంలో వసూళ్లు రాబట్టడం ఓ రికార్డేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వసూళ్లు ఇలాగే కొనసాగితే.. అవెంజర్స్ ఎండ్‌గేమ్ టోటల్ ఇండియన్ కలెక్షన్ అయిన రూ.రూ.367 కోట్ల మార్క్‌ను అవతార్-2 ఈజీగా అధిగమించగలదని మార్కెట్ వర్గాల టాక్.