August Movie Release 2023 Telugu : ప్రతి వారం ప్రేక్షకుల్ని అలరించేందుకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు ఏదో ఒకటి ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతూనే ఉంటాయి. అలానే ఈ ఆగస్ట్ నెలలో కూడా చాలానే చిత్రాలు కూడా థియేటర్స్‌లో సందడి చేశాయి.
Chiranjeevi Bholashankar Collections : అలా ఈ నెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో'(జులై 28) చిత్రంతో సినిమాల సందడి మొదలైంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో పాటు ఎన్నో రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. పవర్ స్టార్ రేంజ్‌కు తగ్గట్టు హిట్ అవ్వలేదు. అయినా పర్వాలేదనిపించే వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లాభాలేమి ఎక్కువ రాలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఆగస్ట్ 11న థియేటర్స్‌లోకి గ్రాండ్‌గా వచ్చి మొదటి షో దగ్గరే బోల్తా కొట్టేశారు. చిరు రీఎంట్రీ కెరీర్లో ఆచార్య తర్వాత మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకుందీ సినిమా. నిర్మాత అనిల్ సుంకరతో పాటు బయ్యర్లు నష్టపోయారని వార్తలు వచ్చాయి. వీకెండ్లో కూడా ఈ చిత్రం వసూళ్లను అందుకోలేక చతికిలపడింది.
Rajinikanth Jailer Collections : అదే సమయంలో భోళశంకర్కు పోటీగా ఆగస్ట్ 10న వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఇప్పటికే రూ.600కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. రూ. వంద కోట్లకు పైగా లాభాలను అందుకుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.